ఔను.. వాళ్లిద్దరూ కలిసిపోయారు..!

Share this :
  •  చంద్రబాబు అరెస్ట్‌తో ఒక్కటైన కాపు-కమ్మ
  •  ఏపీలో కాపు జనపరంగా.. కమ్మ ఆర్థికంగా బలమైన సామాజిక వర్గాలు
  •  శరవేగంగా మారుతోన్న ఆంధ్రా రాజకీయాలు
  •  బలమైన రాజకీయశక్తిగా మారనున్న కాపు-కమ్మ కమ్యునిటీలు

ఔను వాళ్లిద్దరూ కలిసిపోయారు! ఒక్క అరెస్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు మారిపోతున్నాయ్‌.. ఒకప్పుడు ఏపీలో ఉప్పు-నిప్పులా ఉండే కాపు, కమ్మ సామాజిక వర్గాలు చంద్రబాబు అరెస్ట్‌తో ఏకమమయ్యాయి.  ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చనీయాంశమైంది. ఈ నెల 9వ తేదీన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో దాదాపు రూ.371 కోట్లు చేతులు మారాయనే ఆరోపణల మీద తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఐడీ అరెస్టైన సంగతి తెలిసిందే. 2014-18 మధ్య స్కిల్‌ కుంభకోణంలో షెల్‌ కంపెనీల ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారనే ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. ఇక బాబు అరెస్ట్‌పై ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండగా.. మరోవైపు దత్త పుత్రుడు, జనసేన పార్టీ పవన్‌ కళ్యాణ్‌ గళం విప్పారు. ప్రస్తుతం బాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో కస్టడీలో ఉన్నారు.

చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్‌ పలు మార్లు హడావిడిగా హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లి హంగామా చేసిన విషయం తెలిిందే.. ఇదే వీరిద్దరి కలిశారని తెలపడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు.  2019 ఎన్నికల అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక రెండు నెలలకు ఒక మారు వచ్చేవారు. అయితే, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబును సీఐడీ పోలీసులు సెప్టెంబర్‌ 9న అరెస్టు చేసిన వెంటనే పవన్‌ ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద విజయవాడకు బయల్దేరారు. అయితే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన రోడ్డు మార్గంలోనే విజయవాడకు బయల్దేరారు. రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే పడుకొని నిరసన తెలిపారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఆ తర్వాత నాలుగు రోజులు కూడా గడవక ముందే మళ్లీ రాష్ట్రానికి బయల్దేరారు.

జైలులో ఉన్న బాబును కలిసేందుకు పవన్‌కు ఇంత తాపత్రయం ఎందుకన్న ప్రశ్న వీరి కలయికకు మరో నిదర్శనం. కాపు రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడే రాష్ట్రానికి రాని పవన్‌.. చంద్రబాబుకు ఇంత ప్రాధాన్యత ఎందుకిస్తున్నారనేది ఓపెన్‌ సీక్రెట్‌గా మారింది. ఇదంతా పక్కన పెడితే జైలులో బాబుతో భేటీ అనంతరం వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పనిచేస్తాయని పవన్‌ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబుకు కమ్మ సపోర్ట్‌, పవన్‌కు కాపు సపోర్ట్‌ ఎలాగూ ఉంది. నిజానికి కమ్మ ఆర్థికంగా బలమైన సామాజిక వర్గం. ఇక కాపు జన పరంగా ఏకమైన వర్గం. సీఎం జగన్‌ ప్రభుత్వం తెలిసో.. తెలియకో చేసిన బాబు అరెస్ట్‌ ఈ రెండు వర్గాలను ఏకం చేసినట్లైంది. చంద్రబాబు అరెస్ట్‌తో ఒక్కటైన కాపు-కమ్మ బలమైన రాజకీయశక్తిగా మారనుంది. ఏపీ రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇక బాబు అరెస్ట్‌ నేపథ్యంలో హైకోర్టులో క్యాష్‌ పిటిషన్‌ రద్దుకావడంలో సుప్రీం కోర్టు తలుపు తట్టారు. రేపు (సెప్టెంబర్ 27) అత్యున్నత న్యాయస్థానంలో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలని, జ్యూడీషియల్ రిమాండ్‌ను రద్దు చేయాలని, తనపై విచారణను పూర్తిగా నిలిపివేయాలని బాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు సుప్రీంకు వరుస సెలవుల కావడంతో రేపు వాదనలు జరగకపోతే అక్టోబర్‌ 3కు వాయిదా పడే అవకాశం ఉంది. ఇవీ ఏపీలో మారుతోన్న కీలక రాజకీయ పరిణామాలు.