కరోనా మహమ్మారి రాక ముందు అందరూ ఆఫీస్లలో వర్క్ చేసుకొని సాయంత్రానికి ఇళ్లకు చేరుకునేవాళ్లు. కానీ కరోనా వల్ల ఆఫీస్ లు మూసేసి వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేయడం వల్ల తప్పని పరిస్థితిల్లో ప్రతి ఒక్కరి ఇళ్లల్లో వై-ఫై అనేది సర్వసాధారణం అయ్యింది. దీని వల్ల ఉద్యోగస్తులకు ఒకవైపు ఆఫీసు పనులు, మరోవైపు పిల్లలు చదువుకోవడం చాలా తేలికగా మారింది. అంతేకాకుండా, ఇంట్లోని ప్రతి సభ్యునికి హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉంది.దానివల్ల మనందరం వై-ఫై రూటర్‌లకు ధన్యవాదాలు చెప్పాలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ అన్ని అవసరాలు, సౌకర్యాల కారణంగా ప్రజలు వై-ఫై రూటర్‌ను 24 గంటలూ ఆన్‌లో ఉంచుతారు. కార్యాలయం తెరిచిన తర్వాత కూడా ప్రజలు పగలు, రాత్రి వై-ఫైని కనెక్ట్ చేస్తారు. కానీ దాని వల్ల మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం అని నిపుణులు చెప్తున్నారు. వై-ఫై రూటర్ రోజంతా ఆన్‌లో ఉన్నప్పుడు, అది తక్కువ రేడియేషన్‌ను అనేది ప్రొడ్యూస్ అవుతుందట.దీని దుష్పలితాలు వెంటనే రాకపోయినా.. భవిష్యత్ లో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
విద్యుదయస్కాంత వికిరణం క్యాన్సర్‌కు కారణమవుతుంది. ముఖ్యంగా రాత్రిపూట వై-ఫైని ఆన్ చేస్తే, తీరిక సమయాల్లో కూడా యూజర్ల స్క్రీన్ సమయం ఎక్కువసేపు పెరుగుతుంది. దీని వల్ల నిద్ర సమస్యలను అనేవి వస్తున్నాయి.రౌటర్ల నుండి వెలువడే విద్యుదయస్కాంత వికిరణం క్యాన్సర్ ,గుండె జబ్బుల వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుంది. ఇది పిల్లల ఆరోగ్యానికి చాలా హానికరం వై-ఫై ద్వారా విడుదలయ్యే నిరంతర నాన్-థర్మల్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ పిల్లలపైనే కాకుండా పిండం అభివృద్ధిపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తాయని తెలుస్తుంది.
