Akkineni Nagarjuna Sister Death: అక్కినేని నాగార్జున ఇంట తీవ్ర విషాదం.. అందుకే ఆలస్యంగా వెలుగులోకి

పుట్టెడు దుఃఖంలో హీరో నాగార్జున ఫ్యామిలీ

Share this :

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. స్వర్గీయ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూతురు, నాగార్జున సోదరి నాగ సరోజ (Naga Saroja) అనారోగ్యంతో మంగళవారం (అక్టోబర్‌ 17) కన్నుమూశారు. నాగ సరోజ మంళవారం మృతి చెందగా ఈ విషయం కాస్త ఆల్యంగా వెలుగులోకి వచ్చింది. నాగార్జున సోదరి నాగ సరోజ పేరు అందరికీ తెలిసినప్పటికీ ఆమె బయట ఎక్కడా.. ఎప్పుడూ కనిపించింది లేదు. దీంతో చాలా మందికి ఆమె గురించిన వివరాలు తెలియదు.

సినీ రంగానికి దూరంగా..

హీరో సుశాంత్‌ తల్లి అయిన నాగ సుశీల (NagaSuseela) పేరు తెలిసినంతగా.. నాగ సరోజ పేరు తెలియదు. ఆమె సినిమా రంగానికి దూరంగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. అలనాటి స్టార్‌ హీరో కుమార్తె అయినప్పటికీ టాలీవుడ్ (Tollywood)లో ఏ సినిమా రిలీజ్‌ ఫంక్షన్‌లో కానీ, బయట ఏ ఇతర ఫంక్షన్‌లోనూ పెద్దగా కనిపించింది లేదు. ఎంతో సింపుల్‌గా సాదాసీదా జీవితాన్ని గడిపేవారు. నాగ సరోజ చివరి వరకు ఇలాగే సింప్లిసిటీతో ఉండిపోయింది. అందుకే ఆమె మరణించిన వార్త (Nagarjuna Sister Died) కూడా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read: Actress Shruti Haasan in Politics: రాజకీయాల్లోకి స్టార్‌ హీరోయిన్ ఎంట్రీ? మరోసారి క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

కాగా అక్కినేని నాగేశ్వరరావు-అన్నపూర్ణ దంపతులకు (Akkineni Nageswarao family) మొత్తం ఐదుగురు సంతానం ఉన్న సంగతి తెలిసిందే. నాగార్జునతోపాటు సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ, వెంకట్‌ ఐదుగురు సంతానం ఉన్నారు. వీరిలో సుమంత్ , సుప్రియ తల్లి సత్యవతి చాలా ఏళ్ల క్రితమే మరణించారు. ఏదో పని మీద ముంబైకి వెళ్లిన సత్యవతి అక్కడే చనిపోయారు. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతోన్న నాగ సరోజ తాజాగా మృతి చెందారు. సినీ ప్రముఖులు, పలువురు బంధుమిత్రులు నాగ సరోజ పార్ధివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.

Also Read: TS Assembly Polls 2024: తెలంగాణ తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ నగదు.. రూ.130 కోట్లు దాటిన లెక్కపత్రంలేని సొమ్ము

అక్కినేని నట వారసులు అంతమంది ఉన్నప్పటికీ..

తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది . మూడు తరాలుగా సినీ పరిశ్రమకు సేవలందిస్తున్నారు. నాగేశ్వరరావు నటన వారసత్వాన్ని ఆయన చిన్న కొడుకు నాగార్జున కొనసాగిస్తున్నాడు. ఇక మనవళ్లు సుమంత్, నాగ చైతన్య, అఖిల్, సుశాంత్ ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వెంకట్ , నాగ సుశీల సినిమాలు నిర్మిస్తుండగా, సుప్రియ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు చూస్తున్నారు . అక్కినేని కుటుంబ సభ్యులు చాలా మంది సినీ పరిశ్రమలో కొనసాగుతుండగా నాగ సరోజ మాత్రం మొదటి నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంది . ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖుల కుటుంబాల్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం నిర్మాత దిల్ రాజు తండ్రి , సీనియర్ నటుడు నాజర్ తండ్రి కన్నుమూశారు. తమిళ హీరో విజయ్ ఆంటోని కూతురు సూసైడ్‌ చేసుకుని తనువు చాలించింది.