అమరావతి, అక్టోబర్ 28: దివంగత నేత వంగవీటి రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వివాహ (Vangaveeti Radha Marriage) వేడుక గత ఆదివారం (అక్టోబర్ 22) విజయవాడ (Vijayawada)లోని పోరంకిలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకకు రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు (Pawan Kalyan) హాజరయ్యి వధువు పుష్పవల్లి, వరుడు వంగవీటి రాధాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహ వేడుకకు హాజరైన జనసేన నేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan at Radha Wedding) వంగవీటి దంపతులకు అభినందనలు తెలిపి, వారితో ఫొటోలు దిగారు.
ఇక వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా అక్కడ ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వంగవీటి రాధా (Vangaveeti Radha) పెళ్లికి హాజరైన సమయంలో కనిపించిన వీడియో ఫుటేజీలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), కొడాలినాని (Kodali Nani) ఇద్దరూ ఒకే వేదికపైకి రావడం, పైగా షేక్‌హ్యాండ్ (Shake Hand) ఇచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు ఇలా సన్నిహితంగా మెలగడం చూపరులకు ఆశ్చర్యంగా అనిపించింది.
కొడాలి నానీతో పవన్ కరచాలనం
వంగవీటి రాధాకు అభినందనలు చెప్పడానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వెళ్లగా.. ఆయనకు ఎదురుగా జనం మధ్యలో కొడాలి నాని కనిపించారు. అంతే.. పవన్ కళ్యాణ్‌ను చూసిన వెంటనే నాని రెండు చేతులు జోడించి నమస్కారం చేయగా.. నానీకి పవన్ కళ్యాణ్ నవ్వుతూ ప్రతినమస్కారం చేశారు. అనంతరం నాని చెయ్యి పట్టుకుని ముందుకు లాగిన పవన్.. కొడాలి నానీతో కరచాలనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం గుడివాడలో మాత్రం రాజకీయంగా దుమారం రేపింది.
#PawanKalyan shakehand with #KodaliNani
Pedda shock eyy❤️🤝 pic.twitter.com/T0k4qEw5ZW
— Siva Harsha (@SivaHarsha_23) October 25, 2023
పవన్ షేక్ హ్యాండ్పై జనసైనికుల ఆగ్రహం
అయితే నానికి పవన్ షేక్ హ్యాండ్ ఇవ్వడం జనసైనికులకు సుతారం నచ్చలేదు. గతంలో పవన్ పెళ్లిళ్లు, ఆయన భార్యలు, తల్లిపై నీచాతి నీచంగా మాట్లాడిన కొడాలి నానికి పవన్ కరచాలనం ఇవ్వడం ఏంటంటూ జనసైనికులు (Janasena), అభిమానులు, సామాజిక వర్గం వారు గుర్రుమంటున్నారు. పావలా పవన్, దత్తపుత్రుడు, ప్యాకేజీ పవన్ అంటూ గతంలో తీవ్ర విమర్శలు చేసిన కొడాలి నాని (Kodali Nani)కి ఎలా షేక్ హ్యండ్ ఇస్తావంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో శత్రువులను కూడా ప్రేమగా పలకరించే గుణం పవన్‌ది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎంత రాజకీయ ప్రత్యర్థులైనా ఇలాంటి శుభకార్యాల్లో ఒకరినొకరు పలకరించుకోవడం సాధారణమేనని మరికొందరు అంటున్నారు. ఇప్పుడు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చిన కొడాలి నాని, రేపు మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను నోటికి వచ్చినట్లు తిడతారని, అతని బుద్ధి అదేనంటూ విమర్శిస్తున్నారు. పవన్‌తో షేక్ హ్యాండ్ కోసం నాని ఎగబడ్డారంటే.. నానితో పరిచయం కోసం పవన్ చేయి ఇచ్చారంటూ ఎవరికి తోచిన రీతిలో వారు అల్లుకుపోతున్నారు. తాజా పరిణామంపై టీడీపీ (TDP)-జనసేన (Janasena) పార్టీలు మాత్రం నాని టార్గెట్‌గానే ఆరోపణలు చేస్తున్నాయి.
Just Hand Shake kosam 😬🔥
King @PawanKalyan 😎pic.twitter.com/c0NN1IpqaU
— . (@Teledhu__) October 25, 2023
కాగా వంగవీటి రాధా పెళ్లికి వివిధ పార్టీల నేతలను ఆహ్వానించారు. జనసేన నేత పవన్‌తోపాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వంశీని పెళ్లికి పిలిచారు. వంగవీటి రాధాకృష్ణకు కొడాలి నాని, వల్లభనేని వంశీలు మంచి మిత్రులనే విషయం తెలిసిందే. వీరి మధ్య మంచి స్నేహబాంధవ్యాలు ఉన్నాయి. పార్టీలు వేరైనా వీరి స్నేహం మాత్రం ఇప్పటికీ అలానే కొనసాగుతోంది.

Comments are closed.