దుబ్బాక, అక్టోబర్ 30: తెలంగాణ (Telangana) బీఆర్ఎస్ (BRS) ఎంపీ, ఆ పార్టీ దుబ్బాక అభ్యర్థి (Dubbak assembly constituency) కొత్త ప్రభాకర్‌రెడ్డి (MP Kotha Prabhakar Reddy)పై సోమవారం సాయంత్రం (అక్టోబర్ 30) ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సూరంపల్లిలో ప్రభాకర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం చేస్తున్న క్రమంలో పాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వస్తుండగా ఎంపీపై దాడి (Attack on MP) జరిగింది. కరచాలనం చేసేందుకు వచ్చిన దట్టని రాజు అనే వ్యక్తి ఉన్నట్టుండి తన వెంట తెచ్చిన కత్తి (Knife)తో ఒక్కసారిగా ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేశాడు. ఆయనకు పొట్ట పైభాగంలో గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తిని కార్యకర్తలు దొరకపుచ్చుకుని చితకబాదారు.
ఈ ఘటనలో మంత్రి పొట్టకు గాయమై, రక్తస్రావమైంది. వెంటనే కార్యకర్తలు ఆయనను వాహనంలో గజ్వేల్ ఆస్పత్రికి (Gajwel government hospital) తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. నిందితుడు మిరుదొడ్డి మండలం పెద్దప్యాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఓ యూట్యూబ్ ఛానల్లో విలేకరిగా పనిచేస్తున్నట్లు సమాచారం.
కాగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (Medak MP Kotha Prabhakar Reddy) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త ప్రభాకర్ రెడ్డి దౌల్తాబాద్ మండలం సూరంపల్లి (Surampalli village)లో ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడంతో ఆయన కారు నుంచి కిందికి దిగారు. ఇంతలో ఆయనకు కరచాలనం చేసేందుకు వచ్చిన నిందితుడు రాజు కత్తితో దాడి చేశాడు. దాడికి గల కారణాలు ఇంకా తెలిలియరాలేదు.
ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి వార్త దావానంలా రాష్ట్ర మంతటా వ్యాపించింది. నారాయణఖేడ్ సభకు వెళ్తుండగా మంత్రి హరీశ్‌రావుకు ఈ సమాచారం అందింది. వెంటనే మంత్రి హరీష్ రావు హుటాహుటిన ఫోన్లో ఎంపీ ప్రభాకర్ రెడ్డితో మాట్లాడి క్షేమసమాచారం తెలుసుకున్నారు. అవసరం ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారిని మెరుగైన వైద్యం కోసం గజ్వేల్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లో సికింద్రాబాద్ యశోద కు తరలిస్తున్నారు.
#Telangana: #BRS MP #KothaPrabhakarReddy was stabbed in the stomach by an unidentified person during his campaign in #Siddipet. He is safe. The incident took place in Surampally village of the Daulatabad mandal. (ANI) pic.twitter.com/4IJNNzuAB7
— TOI Cities (@TOICitiesNews) October 30, 2023
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ దాడి ఘటనపై సీఎం కేసీఆర్ స్పందన
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు. బాన్సువాడ (Banswada) ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ (KCR) మాట్లాడుతూ.. మనం సమస్యల మీద యుద్ధం చేస్తుంటే ప్రతిపక్షాలు ఈరోజు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై (Medak MP and BRS Dubbak MLA Candidate)కత్తితో దాడి చేయించాయి. అదృష్టం కొద్దీ ఆయనకు అపాయం తప్పింది. ఎన్నికల్లో నేరుగా ఎదుర్కొనే సత్తా లేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. అందుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. గత పదేళ్లలో ఎన్నో సార్లు ఎన్నికలు జరిగాయి. ఎన్నడూ హింసకు దిగలేదు. ప్రజలు గెలిపిస్తే గెలిచాం. చేతనైనకాడికి సేవ చేశాం. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయలేదు. మా సహనాన్ని పరీక్షిస్తే ఊరుకోం. ఈ రోజు దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ మీద జరిగిన దాడి నాపై జరిగిన దాడిగానే భావిస్తా. ఈ దాడులను ఆపకపోతే చూస్తూ ఊరుకోం అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు.

3 Comments
Comments are closed.