TDP Bathyala changalrayudu: వైసీపీ గూటికి బత్యాల..! బెర్త్ ఖాయమేనా? ఆసక్తిగా రాజంపేట రాజకీయాలు

ఎంపీ మిధున్ రెడ్డితో బత్యాల చంగల్రాయుడు మంతనాలు

TDP Bathyala Changalrayudu TDP Bathyala Changalrayudu
Share this :

రాజంపేట, నవంబర్ 4: రాజంపేట (Rajampet) తెలుగుదేశం పార్టీ (Telugudesam Party) నేత బత్యాల చంగల్రాయుడు (TDP Bathyala changalrayudu) తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు విశ్వాసనీయవర్గాల సమాచారం. మరో 6 నెలల్లో రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో (AP Elections 2024) రాజంపేట నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న బత్యాల చంగల్రాయుడు అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీ (YSRCP) గూటికి చేరనున్నారు.

Also Read: TDP Nilayapalem Vijay Kumar Flagged on CM Jagan: ‘కృష్ణా జలాల పంపిణీలో ఏపీకి అన్యాయం జరుగుతున్నా సీఎం జగన్‌ ఎందుకు నోరెత్తడం లేదు?’ 

ఆయన ఇటీవల రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిని తిరుపతి (Tirupati) ఎయిర్‌ పోర్ట్‌లో కలిసి పార్టీ మార్పు విషయంపై ఆయన చర్చించారు. అప్పటి నుంచి తరచూ ఎంపీ మిథున్ రెడ్డి (MP Midhun Reddy)తో టచ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఏపీ (Andhra Pradesh)లో ఎన్నికలకు 5 నెలల సమయం ముందుగానే అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే అక్కడ ఉన్న మేడా మల్లికార్జున్‌ రెడ్డి (Rajampet MP Midhun Reddy) మరోసారి ఎమ్మెల్యే టికెట్ చేజెక్కించుకుంటాడా? లేదా? అనే విషయం చర్చణీయాంశంగా మారింది.

AP-Upcoming-Elections
AP-Upcoming-Elections

Also Read: Varun Tej-Lavanya Tripathi Wedding Photos: వేద‌మంత్రాల సాక్షిగా ఒక్కటైన వరుణ్‌ తేజ్-లావణ్య త్రిపాఠి.. ఫొటోలు వైరల్

అలాగే త్వరలో పార్టీ మారాలనుకుంటున్న బత్యాల చంగల్రాయుడు ఎమ్మెల్యే (MLA) టికెట్ చేజెక్కించుకుంటాడా అనే విషయం కూడా రాజంపేట నియోజకవర్గంలో హాట్‌ టాపిక్ గా మారింది. దీంతో ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గంలో అటు తెలుగుదేశం పార్టీకి.. ఇటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. వలసలు ప్రారంభమయ్యాయని ( AP Politics) చెప్పుకోవాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా రాజకీయ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.