జైపుర్, నవంబర్ 6: రాజస్థాన్ (Rajasthan)లో ఆదివారం రాత్రి (నవంబర్ 5) ఘోర రోడ్డు ప్రమాదం (Bus accident) జరిగింది. 70 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి (Rajasthan Bus Accident) వంతెన పైనుంచి రైల్వే ట్రాక్ (Railway Track)పై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, సుమారు 34 మందికిపైగా తీవ్ర గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక కొత్వాలి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సుమారు 12కి పైగా అంబులెన్స్‌లలో సమీపంలోని జిల్లా ఆసుపత్రికి (Dosa District Hospital) తరలించారు. దౌస జిల్లా (Dosa District) కేంద్రంలోని కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
Also Read: TDP Buchiram Prasad: ‘పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని వైపీసీ మంత్రులు రాజకీయ కేంద్రంగా మారుస్తున్నారు’
హరిద్వార్ (Haridwar) నుంచి జైపూర్ (Jaipur) వెళ్తున్న బస్సు కలెక్టరేట్ కూడలి దౌసా సమీపంలో అదుపుతప్పింది. దీంతో ఒక్కసారిగా బస్సు కల్వర్టు నుంచి 30 అడుగుల దిగువన ఉన్న రైల్వే ట్రాక్‌పై బోల్తా (Bus Accident)) పడింది. బస్సులో దాదాపు 70-80 మంది ప్రయాణికులు ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
క్షతగాత్రుల్లో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు సమాచారం. మృతుల మృతదేహాలను దోసా జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మిగిలిన క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతున్నట్లు వివరించారు. మరో తొమ్మిది మంది ప్రయాణీకుల ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం జైపూర్‌కు తరలించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాజ్‌కుమార్ కస్వా మీడియాకు తెలిపారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న దోసా జిల్లా కలెక్టర్ కమర్ చౌదరి, ఏడీఎం రాజ్‌కుమార్ కస్వా, సబ్ డివిజనల్ అధికారి సంజయ్ గోరా ఘటనాస్థలికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం దోసా జిల్లా ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ప్రమాదం కారణంగా రైల్వే కార్యకలాపాలకు కూడా కొంత సమయంపాటు రైలు సర్వీసులు నిలిచిపోయాయి.
మరిన్ని తాజా జాతీయ వార్తాకథనాల కోసం క్లిక్ చేయండి.
