TDP Nara Lokesh: ‘ఇదే పరిస్థితి కొనసాగితే మరో బీహార్‌లా ఆంధ్రప్రదేశ్..!’ నారా లోకేష్

ఏపీ గవర్నర్‌తో టీడీపీ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ భేటీ

Share this :

విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రవ్యాప్తంగా (Andhra Pradesh) ప్రజల తరపున ఎవరు పోరాడున్నారో, ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో.. వారిపై దొంగకేసులు పెట్టి వేధిస్తున్న తీరును గవర్నర్ కు తెలియజేశామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Nara Lokesh) పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకం, కక్షసాధింపు చర్యలపై మంగళవారం (నవంబర్‌ 7) లోకేష్ నేతృత్వంలో టీడీపీ (TDP) ప్రతినిధి బృందం విజయవాడ (Vijayawada) రాజ్ భవన్‌లో (Raj Bhavan) గవర్నర్ అబ్దుల్ నజీర్‌ (AP Governor Abdul Nazir)ను కలిసి వినతిపత్రం (Petition) అందజేసింది. అనంతరం లోకేష్ (Nara Lokesh) మీడియాతో మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలో ఏపీ మరో బీహార్‌ (Bihar)లా మారబోతోందని గవర్నర్ కు చెప్పాం. జగన్‌ (AP CM Jagan)కు నరనరాన కక్షసాధింపు తప్ప ఏమిలేదని ఆధారాలతో సహా గవర్నర్ కు వివరించాం. ప్రతిపక్షంపై ఎలా కక్ష సాధింపుకు పాల్పడుతున్నారో చెప్పాం. సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ నరేంద్రను నెలల తరబడి ఎలా జైలుకు పంపించారో వివరించాం. జెసి ప్రభాకర్ రెడ్డిపై ఎలా వందల కేసులు పెట్టి వేధిస్తున్నారో తెలియజేశామన్నారు.

Also Read: TDP Bathyala Changal Rayudu: టీడీపీ నేత అచ్చెనాయుడుతో బత్యాల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

టీడీపీ కేడర్‌పై 60వేల తప్పుడు కేసులు!

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీ సీనియర్ నేతలపై 260 తప్పుడు కేసులు ఎలా పెట్టారో వివరాలతో సహా ఇచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి కేడర్, సానుభూతిపరులపై 60వేల కేసులు ఎలా పెట్టారో.. నేను యువగళం పాదయాత్ర చేసినపుడు నాపైన, నాయకులపైన, యువగళం వాలంటీర్లు, కార్యకర్తలపైన ఎలా కేసులు పెట్టారో సవివరంగా తెలియజేశామన్నారు. పవన్ కళ్యాణ్ ఆనాడు రాష్ట్రానికి రావాలనుకున్నపుడు ఎలా అడ్డుపడ్డారో తెలియజేశామన్నారు. రాష్ట్రంలో ప్రజలపై కూడా ముఖ్యమంత్రి ఎలా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారో, అమర్ నాథ్ గౌడ్ ను ఎలా చంపారో, దళిత యువకుడు శ్యామ్ కుమార్ ను ఎలా అవమానించారో వివరించామన్నారు. పలమనేరులో పదోతరగతి విద్యార్థిని మిస్బాను వైసీపీ నేత వేధించి ఎలా ఆత్మహత్య చేసుకునేలా చేశారో, ఇంకోవైపు జ్యుడీషియరీపై కూడా ఎలా దాడులు చేస్తున్నారో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

ఎలక్టోరల్ బాండ్లు కూడా అవినీతేనా?

మూడుసార్లు సిఎంగా పనిచేసిన చంద్రబాబుపై ఆధారాల్లేక పోయినా, 17ఎ పర్మిషన్ లేకపోయినా దొంగకేసులు పెట్టి ఎలా సతాయించారో, జ్యుడీషియల్ రిమాండ్ కు ఎలా పంపారో వివరించాం. స్కిల్ కేసులో తొలుత 3వేల కోట్లు అవినీతి అన్నారు, తర్వాత 370 కోట్లు అన్నారు, ఇప్పుడు 27కోట్లు అంటున్నారు. అది కూడా పార్టీ ఎకౌంట్ లో పడ్డాయని చెప్పి ఎలా ఇబ్బంది పెట్టారో చూశాం. సామాన్య ప్రజలకు ముఖ్యమంత్రి సైకో అని అర్థమైంది, ఏ తప్పుచేయని చంద్రబాబుపై చివరకు 27కోట్లు పార్టీ అకౌంట్ కు వచ్చిందని ఆరోపణలు చేస్తున్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిపై 27కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తారు, అది కూడా ఎలక్టోరల్ బాండ్లు గురించి, ఎవరైనా వింటే నవ్విపోరా? 2014నుంచి వైసిపికి ఎకౌంట్ లోకి 150కోట్లు ఎలా వచ్చాయి, వారికి ఎలాంటి ఖర్చులు లేవా?

తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తాం!

లోకేష్‌ ఇంకా ఇలా మాట్లాడారు.. 17ఎకి 2018లో సవరణ వచ్చింది. చంద్రబాబుపై కేసు విషయంలో పర్మిషన్ తీసుకోవాల్సి ఉండగా తీసుకోలేదని చెప్పాం. వివరాలన్నీ తెప్పించుకుంటామని గవర్నర్‌ చెప్పారు. భయం మా బయోడేటాలో లేదు. పోరాటమే. అడ్డొస్తే తొక్కుకుంటా పోతాం. చంద్రబాబు ఇంటీరియమ్ బెయిల్‌పై వచ్చారు. ఈ నెల 10వతేదీ నుంచి రెగ్యులర్ బెయిల్‌పై విచారణ ఉంది. వచ్చే తీర్పులను బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ ప్రభుత్వంలో దొంగ కేసులు పెట్టడం అనివార్యం అయిపోయింది. రాష్టస్థాయి నుంచి గ్రామ కార్యకర్త వరకు కేసులు పెడుతున్నారు. న్యాయపోరాటం చేస్తాం. టీడీపీ కార్యకర్తలకు న్యాయసహాయం అందిస్తున్నాం. కార్యకర్తలను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. కాపాడుకుంటాం.

Also Read: TDP Buchiram Prasad: ‘పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని వైపీసీ మంత్రులు రాజకీయ కేంద్రంగా మారుస్తున్నారు’

రేపు ఎన్నికల కమిషన్‌ను కలుస్తాం!

రాష్ట్రంలో ఓటర్ల జాబితా అవతకతవకలపై రేపు టీడీపీ బృందం ఎన్నికల కమిషన్‌ను కలుస్తుంది. 6 లేఖలు ఇస్తాం. తప్పుల తడక ఓటరు లిస్టుపై ఫిర్యాదు చేస్తాం. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. దొంగఓట్లపై మేం పోరాడతాం. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఢిల్లీకి కూడా వెళ్లి పోరాటం కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి ఫోటోతో కూడా దొంగఓటు ఉంది. సీఎం 38కేసుల్లో దొంగ. 10సంవత్సరాలుగా కేసుల్లో బెయిల్‌పై తిరుగుతున్న దొంగ. సొంత బాబాయిని లేపేసిన వ్యక్తి జగన్. అవినాష్ రెడ్డిని కాపాడటానికి సీబీఐని ఏపీకి రానీయకుండా చేశారు. దొంగ నుంచి మంచి పరిపాలన ఎలా ఆశిస్తాం? జగన్ పై 38కేసులు ఉన్నాయి. 11 సీబీఐ, 7 ఈడి కేసులు ఉన్నాయి. పదేళ్లుగా బెయిల్ పై తిరుగుతున్నాడు. ఏ తప్పు చేయని చంద్రబాబును 38 కేసులున్న వ్యక్తి 53రోజులు జైలులో ఉంచాడు. అందుకే రాష్ట్రంలో 2019 నుంచి రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని అంటున్నాం.

నాయకులంతా ప్రజల్లోనే..!

ఎన్ని అడ్డంకులు సృష్టించినా నాయకులందరం ప్రజల్లో ఉన్నాం. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీపై ఇంటింటికీ తిరుగుతున్నాం. ప్రతిపక్షనేతలపై దాడులను కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో చెబుతున్నాం. జేఏసీ మీటింగ్‌లో కూడా టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను జనసేనకు వివరించాం. చాలా బాగుతున్నాయని అన్నారు. పవన్ కొన్ని అదనంగా సూచించారు. వాటిపై జేఏసీ మీటింగ్ లో చర్చిస్తున్నాం. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది. రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. పశ్చిమప్రాంతంలో తాగునీటికి కటకటలాడుతున్నారు. దీనిపై ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నామని లోకేష్ తెలిపారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.