Vyooham Movie Trailer Row: వ్యూహం సినిమా (Vyooham Movie) నుంచి విడుదలైన రెండు ట్రైలర్స్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను అవమానించినందుకు ఆ సినిమా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Director Ram Gopal Varma)పై టీడీపీ రీసెర్చ్ అండ్ కమ్యునికేషన్ కమిటీ సభ్యుడు టీ గంగాధర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అతను ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు ఏంటంటే.. ‘వ్యూహం’ మువీ ట్రైలర్లో (Vyooham Movie Trailer) ‘బాబు చెప్పిన అబద్ధాలు, వాళ్ళు ఎలక్షన్ తరువాతే తెలుసుకుంటారు’, ‘ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కీం(skill Development Case)లో దోచుకున్న సొమ్ము ఎవరి పాకెట్లోకి వెళ్ళింది’ అనే డైలాగులు అజ్మల్ అమీర్ అనే నటుడి పాత్ర ద్వారా చెప్పడం కనిపిస్తుంది. ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాత్రదారిని చూపిస్తూ ‘ఎప్పుడోకప్పుడు మీరు కళ్యాణ్‌ను కూడా వెన్నుపోటు పొడుస్తారుగా ” అని చెప్తాడు. ‘వాడికంత సీన్ లేదు, తన్ను తానే పొడుచుకుంటాడు’ అని చంద్రబాబు గొంతును అనుకరిస్తూ.. చంద్రబాబు పాత్రదారుడు అనడం ట్రైలర్లో కనిపిస్తుంది.
చదవండి: TV9 Vs Mahasena Media: మహాసేన మీడియా వర్సెస్ టీవీ9.. ఇక కేసుల జాతర మొదలైనట్టే!
అలాగే వ్యూహం సినిమా (Vyooham Movie)లోని ఒక పాటలో (Vyooham Movie Songs) ‘పులుల రూపంలో గుంటనక్కలు పొంచి చూస్తున్నాయి’ అనే చరణం వినపడేటప్పుడు చంద్రబాబు పాత్రదారిని క్రూరంగా చూపారు. ‘చెడు మంచి నీడలో, నీతి కరువయ్యింది. అవినీతి పాలనలో వెన్నుపోటు రాజులు’ అనే లైన్లు పాటలో వినిపించేటప్పుడు కూడా చంద్రబాబు (Chndrababu naidu) పాత్రదారిని వీడియోలో చూపారు. ఇదే మాదిరిగా 3 వీడియోలు సోషల్ మీడియాలో విడుదల చేసి చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను తీవ్రంగా అవమానించారు. సమాజంలో వారి పరువు, ప్రతిష్టలను దిగజార్చారు. వారి రాజకీయ పార్టీలు తెలుగు దేశం (TDP), జనసేనలను (Janasena Party), ఆ పార్టీల నాయకులను, కార్యకర్తలను, అభిమానులను కించపరిచి, వారి మనోభావాలను దెబ్బతీసి, వారిని రెచ్చగొట్టేలా సినిమా ట్రైలర్, పాటలు ఉన్నాయి.
Here is VYOOHAM trailer https://t.co/3CVFnMzHBY #VyoohamTrailer
— Ram Gopal Varma (@RGVzoomin) October 13, 2023
ఆ పాత్రలు మా పార్టీల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనే కాకుండా దేశమంతా, శాంతి, భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తున్న వ్యూహం ( Vyooham Movie) దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma), నిర్మాత దాసరి కిరణ్ కుమార్ (Dasari Kiran kumar), నటులు అజ్మల్ అమీర్ (Ajmal Ameer), నటి మానసా రాధాకృష్ణన్, ఆ సినిమాలోని ఇతర నటీనటులు, ఆ సినిమాకు పనిచేసిన 24 క్రాఫ్ట్స్ సిబ్బంది మొత్తం మీద కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో టీడీపీ గంగాధర్ (TDP Gangadhar) ఫిర్యాదు చేశాడు.
View this post on Instagram
కాగా వివాదాస్పద దర్శకుడు తెరకెక్కించిన తాజా చిత్రం వ్యూహం రాజకీయంగా తీవ్ర దుమారం లేపుతోంది. గతంలో ఎలక్షన్స్ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ సమయానికి వ్యూహం అనే పొలిటికల్ సినిమాతో రాబోతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) మరణం తర్వాత జగన్‌పై జరిగిన కుట్రలు, 2009 నుంచి 2014 వరకు జరిగిన రాజకీయ పరిణామాలు, ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పులు ప్రధాన కథనంగా వ్యూహం చిత్రాన్ని ఆర్జీవీ రూపొందించాడు. ఇప్పటి వరకు రెండు పార్ట్‌లుగా వ్యూహం ట్రైలర్‌ను విడుదల చేసిన ఆర్జీవీ ఏపీలో పొలిటికల్ AP Politics) హీట్ పెంచేస్తున్నాడు.
View this post on Instagram
నాకు ఏ రాజకీయ పార్టీల గురించి తెలియదు: ఆర్జీవీ
ఆ మధ్య ఆర్జీవీ వ్యూహం సినిమాపై వస్తున్న వివాదాలకు స్పందిస్తూ.. ఈ సినిమా వెనుక ఎలాంటి వ్యూహం లేదన్నాడు. అలాగే వ్యూహం సినిమా రెండు భాగాలుగా వస్తుందని స్పష్టం చేశాడు. వైఎస్ మరణం తరువాత నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాల తో ఈ రెండు సినిమాలు ఉంటాయి అని అన్నాడు.
View this post on Instagram
తాను ఎంతో సౌమ్యుడని, తాను ఎప్పుడు చంద్రబాబుని కలవలేదన్నాడు. జగన్ అంటే ఒక అభిప్రాయం ఉంది చంద్రబాబు అంటే ఒక అభిప్రాయం ఉందని, ఈ సినిమాలో నేను నమ్మిన నిజం మాత్రమే కనిపిస్తుందన్నాడు. పబ్లిక్ డొమైన్ లో ఉన్న జీవితాలను సినిమా తియ్యడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదని, అసలు తనకు టీడీపీ గురించి కానీ, వైసీపీ గురించి కానీ వేరే పార్టీల గురించి కానీ ఏమీ తెలీదంటూ వర్మ చెప్పుకొచ్చాడు. ఇక వ్యూహం సినిమాలో బట్టలూడదీసి చూపిస్తా అంటూ ఆర్జీవి మొదటి నుంచి ఈ సినిమా పై హైప్ పెంచుతూనే ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
చదవండి: TDP Nara Lokesh: ‘ఇదే పరిస్థితి కొనసాగితే మరో బీహార్‌లా ఆంధ్రప్రదేశ్..!’ నారా లోకేష్

2 Comments
Comments are closed.