TS Elections 2023: తెలంగాణలో ముగిసిన ప్రచార పర్వం.. అమల్లోకి 144 సెక్షన్‌

మూగబోయిన మైకులు.. నిలిచిన నేతల ప్రసంగాలు! పోలింగ్‌పైనే ప్రధాన రాజకీయ పార్టీల గురి

Share this :

హైదరాబాద్‌, నవంబర్‌ 28: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (TS Elections 2023) తుది అంకానికి చేరాయి. మంగళవారం (నవంబర్‌ 28) సాయంత్రం 5గంటలకు ఎన్నికల ప్రచారానికి (TS Assembly Election Campaign) గడువు ముగిసింది. దీంతో మైకులన్నీ మూగబోయాయి. చివరి నిమిషం వరకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా హోరెత్తించాయి. బీజేపీ (BJP), కాంగ్రెస్‌ (Congress), బీఆర్‌ఎస్‌ (BRS) అగ్రనేతలంతా పోటాపోటీగా తెలంగాణలో ప్రచారం సాగించారు.

మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలనే పట్టుదలతో బీఆర్‌ఎస్‌ (BRS)లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో గెలిచాక జోష్‌ పెంచిన కాంగ్రెస్‌ తెలంగాణ (Telangana Elections)లోనూ గెలుపు బావుటా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ అగ్రనేతలంతా ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగియడంతో హైదరాబాద్‌ (Hyderabad)లో 144 సెక్షన్ (144 Section) అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ (Telangana Chief Electoral Officer Vikas Raj) తెలిపారు. రాష్ట్రంలో రాబోయే 48గంటల పాటు ఎలక్షన్ ప్రచారం చేయకూడదంటూ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

చదవండి: Kantara Chapter 1 Teaser: ఆసక్తి రేకెత్తించేలా ‘కాంతార చాప్టర్‌ 1′ టైటిల్‌.. సాక్షాత్తు శివుడిని తలపించేలా టీజర్‌

144 సెక్షన్‌ అమల్లోకి.. ఈ నిబంధనలు అతిక్రమిస్తే జైలుకే..

  • ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
  • సోషల్‌ మీడియాలోనూ అంటే టీవీలు, రేడియోలు, కేబుల్‌ నెట్‌వర్క్‌ల్లో ఎన్నికల ప్రచారం నిషిద్ధం. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్‌ మీడియాలో అవకాశం ఉంటుంది.
  • ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదు. పోలింగ్‌ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్‌పోల్స్‌ నిషేధం
  • బల్క్ SMSలు చేయకూడదు. టీవీలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయకూడదు
  • స్థానికేతరులు సెగ్మెంట్ ను వదిలిపెట్టాలి
  • నగదు, మద్యం కట్టడి పై ప్రత్యేక నిఘా. ఎన్నికలు ముగిసే వరకు మద్యం, కల్లు దుకాణాలు బంద్‌.
  • 48 గంటల పాటు 24 గంటలు సీసీటీవీ మానిటరింగ్ 
  • EVM తరలించే వాహనాలకు GPS ఉంటుంది
  • పోలింగ్ సిబ్బంది ఉదయం 5.30నిమిషాలకు వారి కేంద్రాల వద్దకు చేరుకోవాలి
  • EVMలను పోలింగ్ ఏజెంట్ లు ముట్టుకోకూడదు
  • 27,094 ఏరియాలలో వెబ్‌కాస్టింగ్‌ ఉంటుంది
  • 7571 లొకేషన్‌లలో బయట కూడా వెబ్ కాస్టింగ్ ఉంటుంది
  • 35వేల పోలింగ్ కేంద్రాలు, 3300 సెక్టార్ లో ఏర్పాటు, ప్రతీ సెక్టార్ కు ఒక ఇంచార్జీ
  • EVM ల తరలింపు కోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ – ఎక్కడా ఆగకుండా వెళ్ళాలి
  • ఓటర్ 12 గుర్తింపు కార్డులలో ఎదైనా చూపించి ఓటు వేయోచ్చు
  • పోలింగ్ కేంద్రాల వద్దకు మొబైల్ ఫోన్ అనుమతి లేదు
  • రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూమెంట్, వెహికిల్ ను మానిటరింగ్ చేయాలని డీఈవోలకు ఆదేశాలు
  • 144 సెక్షన్ అమలులో ఉన్న సమయంలో ఐడుగురి కంటే ఎక్కువ మంది గుమిగుడితే కఠిన చర్యలు
  • రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు (school holidays) రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
  • ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలి. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు.
  • ఇవాళ్టి నుంచి ఎన్నికలు ముగిసేవరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 30వ తేదీ సాయంత్రం 5గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు మూసివేస్తారు.

 

ఎన్నికల విధుల కోసం భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. 45వేల మంది రాష్ట్ర పోలీసులు, 3వేల మంది ఇతర శాఖలకు చెందిన సిబ్బంది, 50 కంపెనీల స్పెషల్ పోలీసులు, 375 కంపెనీల కేంద్ర బలగాలు, పక్క రాష్ట్రాలకు చెందిన 23,500 మంది హోంగార్డులు బందోబస్తులో ఉన్నట్లు సీపీ డీఎస్‌ చౌహన్‌ తెలిపారు. ఈ రోజు వరకు మొత్తం రూ.737 కోట్ల సొమ్ము పోలీసులు సీజ్ చేవారు. ఇక ఓటర్ల విషయానికొస్తే.. 2018లో పోస్టల్ బ్యాలెట్ 1లక్ష మంది వేస్తే… ఈసారి 1.5లక్షలు వేస్తున్నారు. మొదటి సారిగా హోం ఓటింగ్ 27,178 వేశారు. రాష్ట్రంలో 15,990 సీనియర్ సిటిజన్ ఉన్నారు. 1.48 లక్షల మంది బ్యాలెట్ ఓట్లు వేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ (Vikas raj) తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.