Actress Thulasi Nair: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

అక్క పెళ్లిలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి షాకిచ్చిన బ్యూటీ

Share this :

Actress Thulasi Nair: అలనాటి అందాల తార రాధ (Actress Radha) గుర్తుందా.. 80వ దశకంలో తన అందచందాలతో కుర్రకారును ఓ ఊపుఊపింది. తెలుగు చిత్ర సీమలో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ బ్యూటీ వివాహనంతరం సినిమాలకు దూరంగా ఫ్యామిలీ లైఫ్‌కి పరిమితమైంది. నటి రాధకు ఇద్దరు కూతుళ్లు (Actress Radha Daughters) ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కూతురు కార్తీక (Actress Karthika Nair) తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాగచైతన్య ‘జోష్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘రంగం’ సినిమా తర్వాత పూర్తిగా తమిళ చిత్ర సీమకు పరిమితమైంది. ఇటీవల సైలెంట్‌గా ప్రియున్ని పెళ్లాడింది కూడా.

ఇక రాధ రెండో కూతురు విషయానికొస్తే.. ఆమె కూడా సినిమా ఇండస్ట్రీలో కొన్ని చిత్రాలు చేసింది. తల్లి, అక్కతో పోలిస్తే.. ఈ బ్యూటీ అనుకోకుండా హీరోయిన్‌గా మారింది. జస్ట్ రెండంటే రెండు చిత్రాల్లోనే నటించింది. అయితే అవి అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఆమె సినీరంగానికి దూరమైంది. ఇప్పుడేమో సడన్‌గా ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా?

పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు తులసి నాయర్ (Actress Thulasi Nair). ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందే.. సరిగ్గా గుర్తు రావడం లేదని బుర్రలు బద్దలు కొట్టుకోకండి. రాధ చిన్నకూతురే తులసి. అనుకోకుండా హీరోయిన్ అయిన తులసికి యాక్టింగ్ (Actress Thulasi Nair movies) అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ నటి సుహాసిని ఓసారి చూసి, మణిరత్నం తీస్తున్న ఓ సినిమాకు ఆడిషన్ ఇవ్వమని చెప్పిందట. అలా తమిళ్‌లో ‘కాదల్’ మూవీతో హీరోయిన్ అయ్యింది. దీన్ని ‘కడలి’ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. కానీ రెండు భాషల్లోనూ ఈ మువీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

 

View this post on Instagram

 

A post shared by Thulasi Nair (@thulasin)

ఆ తర్వాత 2014లో ‘యాన్’ అనే మరో తమిళ సినిమాలో హీరోయిన్‌గా తులసి నటించింది. దీన్ని ‘రంగం 2’ పేరు తెలుగులో రిలీజ్ చేశారు. కానీ ఈ మువీ కూడా కలిసి రాలేదు. దీంతో తులసి పూర్తిగా ఇండస్ట్రీకే దూరమైపోయింది. రీసెంట్‌గా అక్క కార్తీక పెళ్లిలో తులసి ప్రత్యక్షమైంది. కాస్త బొద్దుగా, గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈ బ్యూటీ ఫొటోలు చూసి నెటిజన్లు అవాక్కయ్యారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.