Animal Movie: వయొలెన్స్‌ కా బాప్‌.. అయినా సూపర్‌ హిట్‌! పది రోజుల్లోనే రూ.700 కోట్ల కలెక్షన్స్

సినీ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించిన యానిమల్

Share this :

బోల్డ్ అటెంప్ట్, వయొలెన్స్ కా బాప్‌ అన్నట్టుండే సన్నివేశాలు… అయినా యానిమల్‌ మువీ బాక్సాఫీస్‌ (Animal Movie Box Office Collection) వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన అన్ని భాషల్లో సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఓటీటీ (OTT)ల ప్రభావం వల్ల ఇప్పుడు బోల్డ్ కంటెంట్‌కి, వయొలెన్స్‌కి జనాలు కాస్త బాగానే అలవాటు పడ్డారు. అదే యానిమల్‌ (animal movie)కి కోట్లు కొల్లగొట్టిపెడుతోందని ఫిక్సవ్వాలి. 2023లో యానిమల్‌ని యాక్సెప్ట్ చేసిన జనాలు, రానున్న కాలంలో స్పిరిట్‌ని, పుష్ప 2 సినిమాలనూ యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారా? లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రస్తుతం యానిమల్‌ మువీ రూ.500 కోట్ల మార్కు దాటి వెయ్యి కోట్ల వైపు పరుగులు తీస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika mandanna) నటించిన యానిమల్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. డిసెంబర్ 1న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కొంతమంది ఈ సినిమా పై తీవ్ర విమర్శలు చేస్తుంటే, మరికొందరేమో సినిమాను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉందనీ, మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయనీ, అసభ్య పదజాలం వాడారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా ‘యానిమల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్లలో వసూళ్లు రాబడుతోంది.

స్టార్‌ హీరో రణబీర్ కపూర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఈ మువీ నిలిచింది. యానిమల్ సినిమా తొలిరోజు 52 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు రూ.57 కోట్లు, మూడో రోజు 61 కోట్లు వసూలు చేసింది. మొత్తం 9 రోజుల్లో యానిమల్ మువీ ప్రపంచవ్యాప్తంగా రూ.660.89 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఇక10వ రోజు ఇండియాలోనే రూ.37 కోట్లు రాబట్టింది.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ మువీలో బాబీ డియోల్, అనిల్ కపూర్, త్రిప్తి దిమ్రీ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందని సినిమా చివర్లో హింట్ ఇచ్చారు. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.