Vyooham Movie: ఆర్జీవీ ‘వ్యూహం’కి సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. సినిమా విడుదల ఎప్పుడంటే..

'బ్యాడ్ గయ్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ ఇదిగో' ఆర్టీవీ ట్వీట్

Share this :

సంచలన దర్శకుడు రాం గోపాల్‌ వర్మ (Director Ram Gopal Varma) ‘వ్యూహం (Vyooham Movie)’ మువీ రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. సెన్సార్‌ బోర్డు (Censor Board) ఈ సినిమాకు ‘యూ’ సర్టిఫికెట్‌ ఇచ్చింది. దీంతో వ్యూహం మువీ ఈ నెల 29వ తేదీన (Vyooham Release date) సినిమా రిలీజ్‌ కానున్నట్లు ఆర్జీవీ తన సోషల్‌ మీడియా ఖాతాలో ప్రకటించారు. ‘బ్యాడ్ గయ్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ (Censor clearance) ఇదిగో’ అనే క్యాప్షన్‌తో ఆర్జీవీ ట్వీట్‌ చేశారు.

రాం గోపాల్‌ వర్మ డైరెక్షన్‌లో దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మించిన చిత్రం ‘వ్యూహం (Vyooham)’. ఈ సినిమాలో అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ వచ్చిన తర్వాత పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. దీనికి ఆర్జీవి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే మా ‘వ్యూహం’ సినిమా విడుదలను కూడా ఆపలేరు. మా చిత్రం రిలీజ్‌కి అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలో మా వ్యూహం మాకుంది’ అంటూ ఛాలెంజ్‌ చేశారు.

ఇక సెన్సార్ బోర్డ్ తీరును కూడా ఆయన తప్పుబట్టారు. ‘వ్యూహం సెన్సార్‌కు ఇటీవల దరఖాస్తు చేసుకున్నాం. సినిమా చూసిన సెన్సార్ వాళ్లు రివైజింగ్ కమిటీకి పంపామన్నారు. మా సినిమాను రివైజింగ్ కమిటీకి ఎందుకు పంపిస్తున్నారో మాత్రం కారణాలు చెప్పలేదు. గతంలో ఉడ్తా పంజాబ్, పద్మావత్ లాంటి సినిమాల విషయంలోనూ ఇదే మాదిరి జరిగింది. రివైజింగ్ కమిటీల్లోనూ తేల్చకపోవడంతో కోర్టు ద్వారా సినిమా రిలీజ్ ఆర్డర్లు తెచ్చుకున్నారు. సినిమా రిలీజ్‌ను సెన్సార్‌ ఆపకూడదని అప్పట్లో కోర్టు హితోపదేశం చేసింది. మేము కూడా ఇదే దారిని ఫాలో అవుతాం. చట్టపరంగా వ్యూహం సినిమాను రిలీజ్ చేస్తాంటూ’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

మరిన్ని తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.