Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండపై అసభ్య వీడియోలు.. యూట్యూబర్‌ అరెస్ట్!

'అభ్యంతరకర వీడియో క్లిప్‌లు పోస్టు చేస్తే సహించేది లేదు'

Share this :

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తనదైన నటనతో మంచి ఫాలోయింగ్‌ ఉన్న ఈ కుర్ర హీరో ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా రౌడీ హీరోపై ఓ యూట్యూబ్ ఛానెల్ (Youtube Channel) వేదికగా కొన్ని అసభ్యకర కథనాలు (misinformation) ప్రసారం చేశాడు. దీంతో విజయ్‌ దేవరకొండ టీం సదరు యూట్యూబర్‌ (YouTuber)పై హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసుల (Hyderabad Cyber Crime police)కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు యూట్యూబర్‌ను అరెస్ట్ చేశారు.

అసలింతకీ ఏం జరిగిందంటే..

అనంతపురంకు చెందిన వెంకట కిరణ్ అనే యువకుడు ‘సినీ పోలీస్’ అనే యూట్యూబ్ ఛానెల్‌ రన్‌ చేస్తున్నాడు. అందులో విజయ్ దేవరకొండని అవమానిస్తూ అసభ్య వార్తల్ని ప్రసారం చేయసాగాడు. విజయ్ గౌరవాన్ని కించపరిచేలా, ఆయన సినిమాల్లోని హీరోయిన్లని అవమానించేలా ఈ వీడియో క్లిప్‌లు ఉన్నాయి. దీంతో ఆ యూట్యూబర్‌పై విజయ్‌ దేవరకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు యూట్యూబర్‌ వెంకట్‌ కిరణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేయగా కొన్ని గంటల వ్యవధిలోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి, అతని యూట్యూబ్‌ ఛానెల్‌ నుంచి విజయ్‌ దేవరకొండపై పోస్టు చేసిన అభ్యంతరకర వీడియో క్లిప్‌లను కూడా తొలగించారు. భవిష్యత్‌లో ఇలా మరోసారి చేయకుండా ఉండేలా వార్నింగ్‌ ఇచ్చి, వదిలిపెట్టారు.

ఎవరినైనా టార్గెట్‌ చేసి అసత్య వార్తలను ప్రచారం చేసే ఇటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సినీ నటులపై పుకార్లు సృష్టించడం సాధారణమే అయినా ఒక స్థాయి వరకు పర్వాలేదు. కానీ ఏ సంబంధంలేని మూడో వ్యక్తి పేరును అన్యాయంగా లాగి అసభ్యంగా ప్రచారం చేయడం సబబు కాదన్నారు. అలాంటి వారికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇకపై సినీ సెలబ్రెటీలపై చెత్త కామెంట్స్ చేసినా, అవమానిస్తున్నట్లు న్యూస్ టెలికాస్ట్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.