న్నో… మీకు ఓరికైనా ఉజ్జోగం కావాల్నేంటే లెక్క ఎత్తక రాండి

ఏం రా... రామన్న యాడ ఉండావ్...

Share this :

న్నో… మీకు ఓరికైనా ఉజ్జోగం కావాల్నేంటే లెక్క ఎత్తక రాండి… అట్నే అమ్మెల్యేలతో సెప్పిస్తే ఈడ రోంత మంది సారూ/మేడాము ఓళ్లు గోన్మెంట్ ఉజ్జోగాలిస్తారంట…

ఏం రా… రామన్న యాడ ఉండావ్…

న్నా… నేను ఓటల్ కాడ ఉండా న్నా…

ఓటల్ కాడ ఏం సేస్సాండవు రా…

ఏం ల్యా న్నా… ఊర్కే ఉండా…

న్నో… ఈడు అపద్ధం చెప్తాండడు…

రేయ్ ఏమైంది రా నీకు… ఏం జరిగిందో నిజం చెప్పు వోయ్…

ముందు యాడ రా నువ్వు పని సెస్సా ఉన్నిండేది…

ఈడ్నే… రాసీటిలో ఆజంపేట కు పోయే దాల్లో ఉండ్ల ఆడోల్లు, పిల్లోల్ల సంచేమం ఆపీసు లో న్నా…

కంపూటర్ కాడ కుచ్చోని టపా టపా మని కొడతా ఉంటివే…

ఇప్డు ఏమైంది నీ ఉజ్జోగానికి…

తీసేసినారా నిన్ను ఉజ్జొగం నించి…

అవున్నా… ఇప్డు ఏం సెస్సాండవు…

ఓటల్ లో పని సేసుకుంటాండ బతుకుతాండ న్నా…

ఎందుకంట రా ఉజ్జోగం పెరికేసింది…

అన్నమయ్య జిల్లాలో బిల్యాక్ కొడినేటర్ అట్టాంటియి 8 ఉజ్జోగాలు ఉన్యాయి న్నా…

ఈ 8 ఉజ్జోగాలకు దెగ్గర దెగ్గర నూరు మందికి పైన అజ్జీలు పెట్నారు…

అన్ని ఉజ్జోగాలు బైటోల్లకు గాకుండా… ఈడ జిల్లాలో ఉండే ఓల్లకే ఉజ్జోగాలు ఇయ్యాల…

ఒయసు 25 యేండ్ల కాడ నించి 42 యేండ్ల కాడికి ఉండాల…

అజ్జిలు పెట్నోల్లకు కంపూటర్ పరీచ్చ పెట్టాల… గానీ ఈడ అట్టా పరీచ్చ ఏమీ పెట్లా…

పరీచ్చ ల్యాకుండానే అందరినీ ఒటే రోజు ఇంటవ్యూకు పిల్చినారు…

ఎంటియో పేశ్నలు అడిగేసి పంపిచ్చేసినారు… మళ్ళ సూస్సే ఇంగే ముంది ఉజ్జోగాలు ఇచ్చేసినాం అన్యారు…

పరీచ్చలు లేవు… ఇంటవ్యూ ఏం సేసినారో ఆళ్లకే తెలీదు…

మొత్తానికి అమ్మెల్యేలు సెప్పినారని ఆపీసల్లు ఇట్టానుసారం ఉజ్జోగాలు ఏసేశినారని…

ఉజ్జోగాల కోసం వొచ్చినోల్లు గొబ్బు మాటలు తిట్టుకుంటా పాయిరి న్నా…

ఉజ్జోగాలు ఓరికిచ్చినారని సుస్సే మన పాత జిల్లా అడప పక్కన ఉండ్లా సిద్దోటం…

ఆ ఊరి ఆయప్ప ఆజశేఖర్ ఎడ్డి అంట…

ఈయప్పను సుందుపల్లి కి ఏసినారంట…

ఇంగొరు తిపతి ఆయప్ప ఓరొ ములరి కి ఐల్వేతోడురు లో ఉజ్జోగమ్ ఇచ్చినారంట…

మామూల్గా ఐతే ఈళ్ల ఇద్దరికీ ఉజ్జోగాలు ఈగూడ దంట న్నా… మా ఆపీసోల్లు సెప్తాండరు…

నూళ్ళ మంది ఉజ్జోగం కోసం మన జిల్లా ఓళ్ళు ఉంటే ఈల్లేమో పక్క ఊళ్ళో ఒళ్లకు ఉజ్జోగాలు ఇచ్చినారంట… ఇది బైటికి రానీకుండా సేసినారంట న్నా…

ఈ ఉజ్జోగాలకు ఒక్రోకరు లచ్చలు లచ్చలు ఇచ్నారంట న్నా…

ఆపీసు లో అందరూ ఇదే గుసగుస మని మాట్టాడతాండరు న్నా…

ఈ లెక్క ఆపీసోల్లకు పోయిందా ల్యాకపోతే ఇంగా పెద్దోళ్ల కు పోయిందో తెలీదు…

ఇచ్చినోల్లకు, తీసుకున్నోల్లకు బోకల్లకు మాత్తమే తెలియాల్ల..

ఇదంతా జరిగి ఇప్పుటికే మూన్నెల్లైనాది న్నా…

అట్నే ఇంగా రొండు ఉజ్జోగాలుంటే రెండూ తక్కువ ఒయసు ఉన్నోల్లకే ఇచ్చినారంట…

ఓటి… గాలీడు అయబ్బి ఓరో పనొజ్ అంట… ఈయబ్బి ఒయసు 22 ఎండ్లే నంట… ఈ ఈయబ్బికి తక్కువ ఒయసు అందుకు ఉజ్జోగం ఇయ్యకూడదు…

కానీ ఆపీసోల్లు ఉజ్జోగం ఇచ్చేసినారంట… ఈడ లచ్చలు లచ్చల్ అంట న్నా…

రొండు… ఓరో ఆన్సీ అంట… ఈయమ్మకు ఉజ్జోగం ఏసినారంట…

ఈ బీ.కొత్తకోట ఆన్సీ కి కూడా 22 ఏళ్లకే ఉజ్జోగం ఇచ్చినారంట… 25ఏండ్లు ఉండాలంట… ఈడ అయ్యేమీ పట్టిచ్చుకొల్యా…

ఈడ తక్కవ వయస్సు ఉండే ఒళ్లకే ఉజ్జోగాలు ఇచ్చినారని బైట ఉజ్జోగాలు రానోల్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాండరు న్నా…

ఈడ ఉజ్జోగాలకు ఓరికి వొళ్ళు అమ్మెల్యేల తో సెప్పిచ్చు కున్యారు…

నోటికేశన్ లో ఉండ్లా ఆ నిబంధనాలు ఏం మాత్తం పట్టిచ్చు కోల్యా…

రెండు, మూడు నెల్ల కింద ఈ ఉజ్జోగాల సంగతి అంతా సల్లగా జరిగిపోయింది…

ఈ ఉజ్జోగాలు ఇచ్చినదానికి దెగ్గెర దెగ్గర లచ్చలు లచ్చలు లంచాల మాదిరి సేతులు మారి నాయంట న్నా… మా ఆపీసోల్లు బాధ పడతాండరు..

ఇంత మంది బాగా సదువుకున్నోల్ల నోట్లో మట్టి కొట్టి ఇట్టానుసారం ఉజ్జోగాలిస్తే సదువుకున్నోడు సంక నాకాలా అని తిడతాండరు…

బువ్వ తినకుండా గెడ్డి తినే ఓళ్ళు ఉన్నెంత దాక బీదోడు, సదువుకున్యోడు ఉజ్జోగాలు రాక కట్టాలు పడాల్నా…

సామి… దేవుడా నాకు ఉజ్జోగం రాకుండా సేసిన సారూ/మేడాము లను ఏసీబీ వొళ్ళు పట్టు కోవాల… అమ్మెల్యేలు ఎవరైనా ఉంటే ఈ సారి ఒళ్ళు ఒడిపోవాల సామి… నీకు టెంకాయ కొడతా సామి…

బీదోల్ల/ సదుడవుకున్నోల్ల కడుపులు కొట్టే ఒళ్లకూ బతుకే ఉండదు… ఇది నా శాపం మీకు…