తాజా వార్తలు

గ్రంధి శ్రీనుకు కరెక్ట్ మొగుడు అంజిబాబు..!

భీమవరంలో పవన్ కళ్యాణ్ వ్యూహం అదేనా..?

Share this :

ఎవరి పేరు చెబితే.. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీను ఉలిక్కి పడతారో..? ఎవరి పేరు చెబితే గ్రంధి శ్రీనుకు కంటి మీద కునుకు కరువౌతుందో..? ఎవరి పేరు చెబితే ఆయనకు ఓటమి భయం వెంటాడుతుందో..? కరెక్టుగా అలాంటి వ్యక్తికే భీమవరంలో జనసేన పార్టీ టికెట్‌ను కేటాయిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను పోటీ చేయాల్సిన స్థానంలో అత్యంత వ్యూహాత్మకంగా మాజీ ఎమ్మెల్యే పులపర్తిరామాంజనేయులును జనసేన అభ్యర్ధిగా భీమవరం బరిలో నిలిపారు. 2019 ఎన్నికల్లో తనపై తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేసి.. తన ఓటమికి కారకుడైనప్పటికీ.. అంజిబాబును పిలిచి మరీ జనసేనాని టికెట్ కేటాయించటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించకుంది.
వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేరు చెబితే.. ప్రస్తుత ఎమ్మెల్యే గ్రంధి శ్రీను ఉలిక్కి పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అలాగని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనులాగా అంజిబాబు రౌడీయిజం చేస్తారా..? బెదిరింపులకు పాల్పడతారా..? దందాలు, దారుణాలు చేస్తారా..? అంటే కాదు అనే సమాధానం భీమవరం ప్రజానీకం నుంచి ముక్తకంఠంతో వస్తుంది. మంచితనానికి, మానవత్వానికి, నిరాడంబరతకు, ప్రజాసేవకు ప్రతిరూపంగా కనిపించే పులపర్తి అంజిబాబుకు భీమవరం ప్రజల్లో విశేషమైన ఆదరాభిమానాలు ఉన్నాయి. ఆర్ధికంగా స్థితిమంతుడైనప్పటికీ.. గర్వం అనేది మచ్చుకైనా కనిపించని అంజిబాబును.. భీమవరం ప్రజలు నెత్తిన పెట్టుకుంటూ ఉంటారు. అందుకే.. భీమవరం సీటును ఏదో ఒక విధంగా చేజిక్కించుకోవాలని ప్లాన్ చేసిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనుకు.. అంజిబాబు జనసేన అభ్యర్ధిగా రావటంతో కంటిమీద కునుకు కరువైందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా గ్రంధి శ్రీనును ఢీకొట్టే నాయకుడు అంజిబాబు అనే టాక్ భీమవరంలో ఉంది. కాపు సామాజికవర్గంలో గ్రంధి శ్రీనుకన్నా అంజిబాబుకే అత్యధిక ఆదరాభిమానాలు ఉన్నాయి. అదే విధంగా బీసీలు, మత్య్సకారులు, ముస్లింలు, దళితులు, వైశ్య, క్షత్రియులు, వ్యాపార వర్గాల్లో అంజిబాబుకు మంచి పలుకుబడి ఉంది. 2019లో వైసీపీ గాలిలోనూ దాదాపు 55 వేలకు పైగా ఓట్లు సాధించి అంజిబాబు తన సత్తా చాటారు. మరోవైపు.. 2019 నుంచి నేటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీను ఊరూ,వాడా శత్రువుల్ని పోగేసుకోగా.. అంజిబాబు మాత్రం అన్ని వర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలను మెయింటైన్ చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులన్నింటికీ ఆయన ఆత్మబంధువులా మెలుగుతున్నారు. 2019 వరకు ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు ఎలాంటి వివాదాలకు తావివ్వక పోవటం, నియోజకవర్గాన్ని ఓ పద్దతి ప్రకారం అభివృద్ధి చేయటం, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపి భీమవరం ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించటం అంజిబాబుకు తిరుగులేని ట్రాక్ రికార్డును క్రియేట్ చేశాయి. టిడ్కో ఇళ్ళ నిర్మాణం చేపట్టినా, అమృత్ నిధులతో భారీ మంచినీటి పథకాలకు శ్రీకారం చుట్టినా, రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన నేతగా అంజిబాబు భీమవరం ప్రజల మనసు చూరగొన్నారు.
అందర్నీ కలుపుకొని వెళ్లే స్వభావం కలిగి ఉండటం, తన ప్రతినిధిగా ప్రజలకు మరింత ఎక్కువగా అందుబాటులో ఉంటారని భావించిన పవన్ కళ్యాణ్.. అంజిబాబుపై ఈ బాధ్యతలు పెట్టినట్టు తెలుస్తోంది. ఏరకంగా చూసినా.. గ్రంధి శ్రీనుకు కరెక్ట్ మొగుడు అంజిబాబే అనే టాక్ ఇప్పుడు భీమవరం నియోజకవర్గంలో వినిపిస్తోంది.