హిందూ ధర్మం అంటే అంత చులకనా..? హిందువుల ఐక్యత ఎక్కడ..?
నేటి సమాజంలో ‘సెక్యులరిజం’ అనే మాటకు అర్థం మారిపోయింది. ఇతర మతాల గురించి చిన్న మాట అన్నా దేశవ్యాప్తంగా అగ్నిపర్వతాలు బద్దలవుతాయి, అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతాయి. కానీ, హిందూ దేవతలను, రామాయణ భారత ఇతిహాసాలను కించపరిస్తే మాత్రం అది ‘అభిప్రాయ స్వేచ్ఛ’ అయిపోతుంది. తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ శ్రీరాముడి గురించి, రామాయణ గాథల గురించి చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. ఒకవేళ ఇవే వ్యాఖ్యలు ఆయన ఇతర మతాల ప్రవక్తల గురించి లేదా గ్రంథాల గురించి చేసి ఉంటే..? ఈ పాటికి పరిస్థితి ఎలా ఉండేదో మనం ఊహించలేం. హిందూ ధర్మం సహనానికి మారుపేరు కాబట్టి ఎవరైనా ఏదైనా అనవచ్చు అనే ధోరణి పెరిగిపోతోంది.
ఇతర మతాలను గమనిస్తే, వారి మతానికి లేదా దైవానికి చిన్న కష్టం వచ్చినా వీధిలోకి వచ్చి పోరాడతారు. వారు కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ‘మతం’ అనే తాటిపై ఏకమవుతారు. కానీ హిందువుల విషయానికి వస్తే.. రాముడు అంటే ఒక కులానికో, కృష్ణుడు అంటే ఒక ప్రాంతానికో పరిమితం చేస్తున్నాం. సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టి, హ్యాష్‌ట్యాగ్‌లతో హడావుడి చేస్తే సరిపోతుందా..? గ్రౌండ్ లెవల్‌లో ధర్మాన్ని రక్షించే నాథుడు ఏడీ..? హిందువులలో ఉన్న కుల విభేదాలు, రాజకీయ ప్రయోజనాలు ధర్మం కంటే ఎక్కువైపోయాయి. అందుకే ప్రకాష్ రాజ్ వంటి వారు ధైర్యంగా హిందూ దైవాలను అవహేళన చేయగలుగుతున్నారు. హిందువుల మౌనమే వారికి ఆయుధంగా మారుతోందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. గతంలో ఉదాహరణలను ఒకసారి ప్రస్తావిస్తే,
ప్రకాష్ రాజ్ & రామాయణం: తాజాగా ఈయన “రామాయణం అనేది కేవలం ఒక కథ మాత్రమే, దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు” అని అనడమే కాకుండా, రాముడి అస్తిత్వాన్ని వెటకారం చేశారు. గతంలో ఇస్రో చంద్రుడిపై దిగినప్పుడు కూడా ఈయన హిందూ సంస్కృతిని అవహేళన చేస్తూ కార్టూన్లు వేశారు.
ఉదయనిధి స్టాలిన్ ‘డెంగ్యూ’ వ్యాఖ్యలు: సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనా వ్యాధులతో పోల్చి.. దాన్ని నిర్మూలించాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. ఇంత జరిగిన హిందువులందరూ ఏకమై ఒక బలమైన రాజకీయ లేదా సామాజిక సమాధానం ఇవ్వలేకపోయారు.
మున్వర్ ఫారుఖీ కామెడీ: స్టాండప్ కామెడీ పేరుతో సీతారాముల పవిత్ర బంధంపై అత్యంత అసభ్యకరమైన జోకులు వేశారు. ఇదే వ్యక్తి ఇతర మతాల ప్రవక్తలపై జోకులు వేసే ధైర్యం చేయగలడా..? చేస్తే అతనికి మిగిలేది ఏంటో అతనికి తెలుసు. కానీ హిందువులు కేవలం ట్విట్టర్ లో అరవడం తప్ప ఏం చేయలేరు అని అతనికి నమ్మకం.
సినిమాల్లో విజువల్స్: ‘కాళీ’ సినిమా పోస్టర్‌లో కాళికా దేవి సిగరెట్ తాగుతున్నట్లు చూపించినా, ‘పీకే’ సినిమాలో దేవుడిని బాత్రూంలో దాక్కున్నట్లు చూపించినా అందరూ ‘సినిమా కదా’ అని నవ్వుతూ చూశారు. అదే వేరే మతంపై ఒక చిన్న కార్టూన్ వేసినందుకు ఫ్రాన్స్ లో టీచర్ తల తీసేసిన ఉదంతం అందరికీ తెలుసు.
తమిళనాడులో పెరియార్ అనుచరులు: రాముడి విగ్రహాలకు చెప్పుల దండలు వేసినా, బహిరంగంగా హిందూ దేవతలను దూషించినా.. వారు ఇప్పటికీ అక్కడ సెలబ్రిటీలుగా చలామణీ అవుతున్నారు.
హిందువుల మధ్య ఐక్యత మిస్ అవ్వడానికి ప్రధాన కారణం ‘సంఘటిత శక్తి’ లేకపోవడమే. “నాకు ఎందుకులే, నాకేం కాదు కదా” అనే స్వార్థపూరిత ధోరణి మనల్ని నాశనం చేస్తోంది. ఒక ప్రకాష్ రాజ్ లేదా ఒక రాజకీయ నాయకుడు హిందూ ధర్మాన్ని కించపరిస్తే, అది కేవలం ఒక దేవుడికి జరిగిన అవమానం కాదు, అది నీ అస్తిత్వానికి జరిగిన అవమానం. ఇతర మతాల వారు తమ మతాన్ని ఒక కవచంలా భావిస్తే, హిందువులు మాత్రం ధర్మాన్ని ఒక సౌకర్యంగా భావిస్తున్నారు. ఐక్యత లేని సమాజం అణిచివేతకు గురవ్వక తప్పదు.
హిందూ ధర్మం ఎవరికీ వ్యతిరేకం కాదు, కానీ ఎవరైనా మన ధర్మాన్ని తక్కువ చేసి చూస్తే చూస్తూ ఊరుకోవడం చేతకానితనం అవుతుంది. సోషల్ మీడియా హడావుడి దాటి, చట్టపరంగా, సామాజికంగా గట్టిగా బుద్ధి చెప్పినప్పుడే ఇలాంటి వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పడుతుంది. ప్రకాష్ రాజ్ వంటి వారు తమ విజ్ఞతను కోల్పోయి మాట్లాడుతున్నారంటే, దానికి కారణం హిందువులలో ఉన్న చీలికలే. ఇప్పటికైనా హిందువులందరూ కులాలకు అతీతంగా ధర్మ రక్షణ కోసం ఏకం కాకపోతే.. భవిష్యత్తులో మన చరిత్రను, సంస్కృతిని మనమే కాపాడుకోలేని స్థితికి చేరుకుంటామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
