Tollywood: సినీ ఇండస్ట్రీలో రచ్చ ముగిసినట్లేనా..?

అంతా సెట్ చేసిన చిరంజీవి

Share this :

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నిర్మాతలు, థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య నడుస్తున్న ‘పర్సంటేజ్’ (కంపల్సరీ షేరింగ్) వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ వివాదంలో జోక్యం చేసుకుని ఇరు వర్గాలతో మాట్లాడటంతో సమస్యకు తాత్కాలిక ముగింపు లభించింది. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ‘పెద్ది’ సినిమా ప్రదర్శన విషయంలో ఎగ్జిబిటర్లు పాత పద్ధతి అయిన ‘రెంటల్ విధానానికే’ మొగ్గు చూపారు. చిరంజీవి సమక్షంలో జరిగిన చర్చల అనంతరం, ఈ సినిమాను పాత రెంట్ పద్ధతిలోనే థియేటర్లలో ప్రదర్శించడానికి ఇరు వర్గాలు అంగీకరించాయి.

Also read: Tamilnadu: తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం..!

టికెట్ ధరల పెంపుదలపై కూడా ఈ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో ఏ సినిమాకైనా ప్రభుత్వం నుంచి టికెట్ ధరల పెంపుదలకు అనుమతి లభిస్తే.. అలా పెంచిన ధరల ద్వారా వచ్చే ఆదాయంలో 7.5 శాతాన్ని థియేటర్ ఎగ్జిబిటర్లకు చెల్లించాలని డిసైడ్ అయ్యారు. ఇది ఎగ్జిబిటర్లకు కొంత ఊరట కలిగించే అంశం. తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులు తమ భవిష్యత్తు కార్యాచరణను చిరంజీవికి వివరించారు. జూన్ 30 తర్వాత విడుదలయ్యే కొత్త సినిమాలన్నింటినీ ఖచ్చితంగా ‘పర్సంటేజ్ విధానం’ (కంపల్సరీ షేరింగ్) లోనే ప్రదర్శిస్తామని వారు మెగాస్టార్‌కు స్పష్టం చేశారు.

Also read: Ys jagan: ప్యాలెస్ లో జగన్ సడెన్ మీటింగ్, రెండేళ్ళ పాలనే టార్గెట్ గా..? 

ఇరు వర్గాల వాదనలు విన్న మెగాస్టార్ చిరంజీవి ఎగ్జిబిటర్లకు ఒక కీలక సూచన చేశారు. ప్రస్తుతం ఈ వివాదంపై టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ఒక ప్రత్యేక కమిటీని వేసిందని గుర్తుచేశారు. కాబట్టి, ఆ ఫిలిం ఛాంబర్ కమిటీ ఇచ్చే తుది నివేదిక మరియు మార్గదర్శకాల ప్రకారమే ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నడుచుకోవాలని, పరిశ్రమ శ్రేయస్సు దృష్ట్యా అందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని చిరంజీవి హితవు పలికారు.

leave a reply