Tamilnadu: తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం..!

తమిళ పాలిటిక్స్ లో ఆగిన ట్విస్ట్ లు

Share this :

తమిళనాడు రాజకీయాల్లో బుధవారం నాడు ఒక అనూహ్యమైన మరియు కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే (AIADMK) లో సాగుతున్న అంతర్గత విభేదాలకు ఎట్టకేలతో తెరపడింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (EPS) తో మాజీ మంత్రి ఎస్.పి. వేలుమణి నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. పళనిస్వామితో జరిగిన ఈ కీలక భేటీలో ఎస్.పి. వేలుమణి అసంతృప్త ఎమ్మెల్యేల తరఫున ఒక స్పష్టతనిచ్చారు.

Also Read: Rajyasabha elections: కమ్మనేతకు పెద్దల సీటు..? ఆయనకే ఛాన్స్..!

అన్నాడీఎంకే పార్టీలో ఎటువంటి చీలికలు లేవని, నాయకుల మధ్య కేవలం కొన్ని అంశాలపై మాత్రమే భేదాభిప్రాయాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. వాటన్నింటినీ పక్కన పెట్టి, పార్టీ బలోపేతం కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని పళనిస్వామికి ఈ సందర్భంగా వేలుమణి బృందం హామీ ఇచ్చింది. పళనిస్వామితో సమావేశం ముగిసిన వెంటనే వేలుమణి నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం నేరుగా తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం. అప్పావును కలిశారు. అసెంబ్లీలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఒకే పార్టీగా, ఒకే తాటిపై ఉండి ప్రతిపక్షంగా పనిచేస్తామని స్పీకర్‌కు అధికారికంగా ఒక లేఖను సమర్పించారు.

దీనితో పార్టీ సాంకేతికంగా విడిపోతుందనే ఊహాగానాలకు పూర్తిగా బ్రేక్ పడింది. స్పీకర్‌తో భేటీ అనంతరం వేలుమణి మీడియాతో మాట్లాడుతూ ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. అంతర్గత వివాదాల సమయంలో పార్టీ మారినట్లు భావించిన కొంతమంది ఎమ్మెల్యేలపై గతంలో ఇచ్చిన అనర్హత వేటు ఫిర్యాదులను (Disqualification Complaints) తాము పూర్తిగా ఉపసంహరించుకున్నామని ప్రకటించారు. అంతా సర్దుమణిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Also Read: Ys jagan: ప్యాలెస్ లో జగన్ సడెన్ మీటింగ్, రెండేళ్ళ పాలనే టార్గెట్ గా..? 

అన్నాడీఎంకే తిరుగుబాటు సభ్యుల నుంచి అందిన లేఖపై స్పీకర్ సానుకూలంగా స్పందించారు. శాసనసభ నిబంధనల ప్రకారం అన్నాడీఎంకే సభ్యులు ఇచ్చిన లేఖను, అనర్హత పిటిషన్ల ఉపసంహరణ అంశాన్ని పరిశీలిస్తున్నామని స్పీకర్ తెలిపారు. ఈ లేఖపై తన తుది నిర్ణయాన్ని రేపు అధికారికంగా ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. ఈ పరిణామంతో తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకే మళ్లీ పూర్తి బలంతో కూటమిని ఢీకొట్టడానికి సిద్ధమవుతోంది.

leave a reply