సియా గోయల్.. గూగుల్ సెర్చ్ హిస్టరీ చూసి పోలీసుల షాక్..!

కేతన్ కోసం ఈ రేంజ్ లో ప్లాన్ చేసిందా..?

Share this :

మాయల మరాఠీలు సినిమాల్లో విలన్ల కంటే దారుణంగా ఆలోచిస్తూ ఘోరాలకు పాల్పడుతున్న ఉదంతాలు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. పూణేకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో భయంకరమైన నిజం బయటకు వస్తోంది. కేతన్ అగర్వాల్‌ను అతని కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి అతి క్రూరంగా కొండపై నుంచి నెట్టి చంపేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దారుణానికి ఒడిగట్టే ముందు సియా గోయల్ పాత మర్డర్ కేసులను అధ్యయనం చేసి, పోలీసులకు దొరక్కుండా పక్కా ప్లాన్ వేసినట్లు పూణే పోలీసుల ఇంటరాగేషన్‌లో తేలింది.

Also Read: కొరియా పర్యటనలో మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్..!

గతంలో మేఘాలయలో సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హత్య కేసుకు, ప్రస్తుత కేతన్ అగర్వాల్ హత్య కేసుకు మధ్య అనేక పోలికలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ కేసులో రాజా రఘువంశీని అతని భార్య సోనమ్ రఘువంశీ ఇలాగే కొండపై నుంచి నెట్టి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. సియా గోయల్ తన మొబైల్ ఫోన్‌లో సోనమ్ రఘువంశీ చేసిన తప్పులను, ఆ కేసు వివరాలను ఆన్‌లైన్‌లో విపరీతంగా రీసెర్చ్ చేసింది. ఆ తప్పులు తాను చేయకుండా, పోలీసులకు చిక్కకుండా ఉండేలా బలమైన అలిబిస్ (సాక్ష్యాలు) సృష్టించుకుంది.

పోలీసులు నిందితురాలి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని బ్రౌజింగ్ హిస్టరీని తవ్వగా మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు వెలుగుచూశాయి. రాజా రఘువంశీ మర్డర్ వివరాలతో పాటు.. “పోలీస్ కస్టడీలో మహిళలను కొడతారా లేదా?”, “మహిళా ఖైదీలకు ఉండే హక్కులు ఏంటి?” అనే కోణంలో కూడా సియా గోయల్ ఇంటర్నెట్‌లో వెతికినట్లు తేలింది. ఒకవేళ ఒంటరిగా నెడితే కేతన్ కింద పడకపోవచ్చనే అనుమానంతో.. ఆమె, ఆమె ప్రియుడు ఇద్దరూ కలిసి లోహగఢ్ కోట ట్రెకింగ్ పాయింట్ వద్ద కేతన్‌ను లోయలోకి నెట్టేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

Also Read: Telangana To AP: తెర ముందు ఆర్టిస్టులు.. తెర వెనుక మాజీలు

ప్రస్తుతం నిందితులు ఇద్దరూ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ లో జైల్లో ఉన్నారు. ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టినా.. సియా గోయల్ గానీ, ఆమె ప్రియుడు చేతన్ గానీ ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం చూపించడం లేదని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. కేతన్ కుటుంబ సభ్యులకు ఆ మరణంపై అనుమానం రావడం, ట్రెకింగ్ చేసిన ప్రదేశం అంత ప్రమాదకరమైనది కాకపోవడంతో పోలీసులు నిశితంగా విచారించి ఈ మాయలాడి గుట్టు రట్టు చేశారు.