తాజా వార్తలు

AP Politics: జోగి రాజీవ్ విషయంలో మేధావులు ఏమయ్యారు..?

తెలంగాణపై ఆంధ్ర పెత్తనం.. మేధావులపై దాడి

Share this :

తెల్లారి లేచిన దగ్గర నుంచి… తెలంగాణలో మీ పెత్తనం ఏమిటి..? రాష్ట్రం విడిపోయి పుష్కర కాలమైనా.. మీకు ఇక్కడ ఏం పని..? అంటూ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మేధావులని చెప్పుకునే కొంతమంది నానా యాగి చేస్తున్నారు. సరిగ్గా రెండు నెలల క్రితం కూడా.. విశ్లేషణ పేరుతో తన నోటికి వచ్చిన కామెంట్లు చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్‌.. పైన జనసేన పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణపై ఆంధ్ర పెత్తనం.. మేధావులపై దాడి.. అంటూ కొందరు హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌‌ వేదికగా ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని.. నానా హంగామా చేశారు. ఆ తర్వాత నుంచి టార్గెట్ ఏపీ అన్నట్లుగా బెదిరింపు వ్యాఖ్యలు చేశారు కూడా.

అయితే తాజాగా ఓ ఘటన మాత్రం ఈ మేధావులు అని చెప్పుకునే వారి తీరును ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ ఆడబిడ్డకు అన్యాయం చేసిన, వైసీపీ మాజీ మంత్రిపైన, ఆయన కుటుంబంపైన తెలంగాణ మేధావులు మౌనంగా ఉన్నారు. ఇలా మౌనం వెనుక అసలు కారణమేమిటనేదే ఇప్పుడు హాట్ టాపిక్. ప్రతి చిన్న విషయానికి, కావ్, కావ్ మంటూ బాహాటంగానే అరిచి, రచ్చ చేసే మేధావులు అని చెప్పుకునే కొందరు తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని తెలిసినా కూడా మౌనం వహిస్తున్నారు. ఓ ఆడపడుచుకు అన్యాయం జరిగిన తర్వాత వీరి అసలు స్వరూపం బయటపడింది.

నిజానికి మేధావులు అని చెప్పుకునే వీరంతా తొలి నుంచి తెలంగాణలో భారత రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను భుజాన వేసుకున్నారనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఈ ముసుగు తొలగిపోయింది. బీసీ, గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓ తెలంగాణ ఆడపడుచుకు తీవ్ర అన్యాయం జరిగింది. హిందువులు అనే ముసుగులో బతుకుతున్న సదరు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబం.. ఆయన పెద్ద కుమారుడు జోగి రాజీవ్‌ వివాహం తర్వాత అసలు బండారం బయటపడింది. వారి కుటుంబం హిందూ వ్యతిరేకులని.. ఇంట్లో జోగి రమేశ్ భార్య క్రైస్తవ మత ఆచారాలను పాటిస్తారని తేలిపోయింది.

ఇక జోగి రాజీవ్‌తో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన మేఘనతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలోనే భారీగా నగదు, బంగారం కట్నం రూపంలో తీసుకున్నారు జోగి రమేశ్ దంపతులు. అయితే పెళ్లి అయిన రెండో రోజు నుంచే అసలు కథ మొదలైంది. జోగి రాజీవ్‌లో శారీరక లోపం ఉందనేది మేఘన చేస్తున్న ఆరోపణ. ఈ విషయం జోగి రమేశ్ దంపతులకు కూడా తెలుసంట. అయినా సరే.. ఆ విషయం దాచి పెట్టి పెళ్లి చేశారు. పైగా అదనపు కట్నం కోసం మేఘనకు నరకం చూపించారు. చివరికి ఆమెను హత్య చేసేందుకు కూడా యత్నించారనేది పోలీసులకు మేఘన చేసిన ఫిర్యాదు సారాంశం. ఇటీవల ఇరు కుటుంబాలు కూర్చుని మాట్లాడుకున్న వీడియోలో కూడా ఈ విషయమే క్లారిటీ వచ్చింది.

మరి ఓ బీసీ మహిళ, పైగా తెలంగాణ ప్రాంతానికి చెందిన యువతికి ఏపీకి చెందిన ఓ మాజీ మంత్రి కుటుంబం అన్యాయం చేస్తే.. సదరు మేథావులు, తెలంగాణ జర్నలిస్టుల మౌనం వెనుక ఎవరి వత్తిళ్లు పని చేస్తున్నాయనేది తెలియాల్సి ఉంది. నిజానికి ఇదే ఇప్పుడు అసలు విషయం కూడా. వాస్తవానికి ఇలాంటి వ్యవహారమే తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన నేతల కుటుంబాల్లో జరిగి ఉంటేనా.. ఇక అంతే సంగతులు.. ఎంత గోల చేసే వారో. వెంటనే “తెలంగాణ అమ్మాయికి అన్యాయం”, “తెలంగాణ యువతి పై ఆంధ్ర నేతల పెత్తనం” అంటూ అవసరం లేని థంబ్‌నెయిల్, హెడ్డింగ్స్ పెట్టి మరీ రచ్చ చేసే వారు.

కానీ ఇక్కడ యువతిపై హత్యాయత్నం చేసింది వైసీపీ నేత కుటుంబం. అదనపు కట్నం కోసం వేధించింది ఓ వైసీపీ మాజీ మంత్రి కుటుంబం. తెలంగాణకు చెందిన వారికి.. వైసీపీ వాళ్లు ఎవరైనా సరే అన్యాయం చేసినా, చివరకు హత్య చేసేందుకు ప్రయత్నించినా కూడా.. మేధావులు అని చెప్పుకునే వాళ్లు నోరు మెదపరని.. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ విషయంలో రుజువైంది. తెలంగాణ ఆడబిడ్డకు జరిగిన అన్యాయాన్ని నిలదీయ లేకపోయారు. ఇక నిత్యం ఆంధ్ర పెత్తనం అంటూ పదే పదే ఆరోపణలు చేసే బీఆర్ఎస్ నేతలు కూడా జోగి విషయంలో సైలెంట్. సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీ నేతలు, చివరికి ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కూడా ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై నోరు మెదపలేదు.

తనకు జరిగిన అన్యాయం గురించి.. తెలంగాణ ఆడబిడ్డ ఆధారాలతో సహా వాస్తవాలను పోలీసులకు ఫిర్యాదు చేసిన.. మీడియా ముందుకు వచ్చి బోరున ఏడ్చినా.. చివరికి ఇరు కుటుంబాల మధ్య జరిగిన పంచాయతీలో కూడా ఈ విషయం బయటకు వచ్చినా కూడా.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏ ఒక్కరు నోరు మెధపటం లేదంటే.. ఎంతగా రాజకీయ ఒత్తిళ్లు పని చేసున్నాయో.. అర్థం అవుతుంది. ఇదే ఘటన టీడీపీ, జనసేన నేతల కుటుంబాల్లో జరిగితేనా.. తెలంగాణ వాదులని చెప్పుకునే వారు.. ఎంత ఘోరంగా రచ్చ చేసి విధ్వంసం సృష్టించే వారో..!? తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ నేతలు ఏం చేసినా కూడా.. ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదంటే.. నిజానికి వారికి ప్రాంతీయత కంటే.. వైసీపీ ప్రయోజనాలే ముఖ్యం అనే మాట బాగా అర్థమవుతుంది. ప్యాకేజ్‌ అందితే చాలు కావ్, కావ్ మంటూ అరుస్తారేమో.. వైసీపీ అభిమానులుగా ముద్ర పడిన కొందరు మేధావి పాత్రికేయులు.. జోగి రమేష్ విషయంలో సైలెంట్‌గా ఉన్నారంటే.. చివరికి వైసీపీ నేతలు ఏం చేసినా కూడా.. వీరంతా మౌనంగా ఉంటారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

leave a reply