తాజా వార్తలు

Andhra Pradesh: ఆర్థిక శాఖల్లో కమిషన్ల గోల..!

5 నుండి 10 శాతం కమిషన్‌ రూపంలో..

Share this :

తెలుగు రాష్ట్రాల్లో ఆర్ధిక మంత్రుల పేరుతో బిల్లుల చెల్లింపులు, కమిషన్ వసూళ్ల వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల పేరుతో పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపు విషయంలో భారీ ఎత్తున కమిషన్‌ల రూపంలో వసూళ్లు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంలో అటు పొలిటికల్ సర్కిల్‌లో కూడా పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క భార్య తనను 10 శాతం కమిషన్ అడిగారని.. ఒక రిటైర్డు ప్రభుత్వ మహిళా అధికారి ఆరోపించారు. రిటైర్డు అయ్యాక.. ప్రభుత్వం నుండి తనకు రావాల్సిన 40 లక్షల రూపాయల బిల్లు కోసం భట్టి విక్రమార్క భార్యను స్వయంగా కలిసినపుడు.. బిల్లు ఇప్పిస్తాను.. అయితే తనకు 10 శాతం కమిషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఆమె అన్నారని రిటైర్డు మహిళా అధికారి చేసిన ఆరోపణలు, విమర్శల వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కమిషన్‌ల గురించి కూడా టీడీపీ అనుకూల పత్రికలే చాలా కథనాలు ప్రచురించాయి. పయ్యావుల కేశవ్ పేషిలో పనిచేస్తున్న ఒక అధికారితో పాటు.. సాయిబాబు అనే ప్రైవేటు వ్యక్తి కూడా ఈ కమిషన్‌ల భాగోతాల వెనుక ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ ముద్ర వున్న కాంట్రాక్టర్‌ల బిల్లులే వేల కోట్ల బకాయిలు చెల్లింపులు జరిగాయనేది అందరికీ తెలిసిన విషయమే. 5 నుండి 10 శాతం కమిషన్‌ రూపంలో ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో.. అంతా ఇచ్చారనేది సచివాలయంలో వినిపిస్తున్న మాట. ఇదే విషయంపై ఆధారాలతో సహా టీడీపీ నేతలే సీఎం చంద్రబాబుకు కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారు కూడా.

అక్కేడేమో భట్టి విక్రమార్క భార్య పైన.. ఇక్కడేమో పయ్యావుల పేషి అధికారులతో పాటు సాయిబాబు అనే ప్రైవేటు వ్యక్తి పైన కధలు కధలుగా ప్రచారం జరుగుతోంది. ఈ కమిషన్‌ల బాగోతాలు అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి.. ఇక్కడ సీఎం చంద్రబాబుకు తెలియకుండా ఉంటుందా.. అని రాజకీయ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్, అమరావతిలో ఆ ఇద్దరు ఆర్ధిక మంత్రుల పేరుతో జరుగుతున్న, కమిషన్‌ల బిల్లుల చెల్లింపులు బాహాటంగానే జరుగుతున్నాయి. అయితే రేవంత్ రెడ్డిని భట్టి సతీమణి ఏమాత్రం లెక్క చేయటం లేదంట. అలాగే చంద్రబాబును కూడా పయ్యావుల కేశవ్ పేషి అధికారులతో పాటు, సాయిబాబు అనే ప్రైవేటు వ్యక్తి కనీసం భయపడటం లేదంట. వైసీపీ అభిమాన కాంట్రాక్టర్లకే వేల కోట్ల బిల్లుల చెల్లింపులు జరుగుతున్న విషయం తెలిసినా కూడా.. ఎందుకు చర్యలు తీసుకోవటం లేదనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.