సాయికృష్ణ కేసులో వైసీపీ సడన్ సైలెన్స్..?

వైసీపీ కాపు నేతలు భయపడ్డారా..?

Share this :

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సంచలనం సృష్టించిన విజయవాడ కృష్ణలంక గాదె సాయికృష్ణ అదృశ్యం (కస్టోడియల్ డెత్) కేసులో ప్రతిపక్ష వైసీపీ వ్యూహాత్మకంగా సైలెన్స్ పాటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వారం రోజుల క్రితం వరకు కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్లు, ధర్నాలు చేసిన వైసీపీ కాపు నేతలు ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు మౌనంలోకి వెళ్లిపోయారు అనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ కాపు నేతలు సాయికృష్ణను ఒక కాపు యువకుడిగా ప్రొజెక్ట్ చేస్తూ సెంటిమెంట్ రాజకీయాన్ని తెరపైకి తెచ్చారు.

Also Read: MP Mahesh Yadav: మా వాళ్లను వదిలేయండి..!

అయితే దీనిపై జనసేన అధినేత, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అత్యంత ఘాటుగా స్పందించారు. సాయికృష్ణకు ఉన్న పాత నేరచరిత్రను, ఒక మైనర్ బాలికను బంధించి హింసించిన కేసును ప్రస్తావిస్తూ.. “ఒక ప్రొఫెషనల్ క్రిమినల్‌కు కులం రంగు పులిమి వైసీపీ నేతలు ఎలా వెనకేసుకొస్తారు?” అంటూ నిలదీశారు. పవన్ కళ్యాణ్ నేరుగా కుల ప్రస్తావన తెచ్చి, నేరస్థుడిని సమర్థించడంపై సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని హెచ్చరించడంతో వైసీపీ డిఫెన్స్‌లో పడింది.

ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడి తరఫున వకాల్తా పుచ్చుకుంటే సొంత కాపు సామాజికవర్గంలోనే మహిళలు, తటస్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు వంటి సీనియర్ కాపు నేతలు గ్రహించారు. క్రిమినల్స్‌ను వెనకేసుకొస్తున్నారనే ముద్ర పడితే రాజకీయంగా భారీ నష్టం జరుగుతుందనే భయంతోనే వారం రోజులుగా వైసీపీ కాపు నేతలు ఈ టాపిక్‌పై నోరు విప్పడం లేదు. ప్రభుత్వం ఈ కేసును నీరుగారుస్తోందని మొదట్లో వైసీపీ ఆరోపించింది.

Also Read: Andhra Pradesh: తిరుమల వెంకన్నకు కోపం వస్తే..?

కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుని, కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనపై మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. అంతేకాకుండా ‘సిట్’ (SIT) దర్యాప్తును వేగవంతం చేసి నిందితులైన కానిస్టేబుళ్లను కూడా పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఇంత వేగంగా, పారదర్శకంగా చర్యలు తీసుకుంటుండటంతో ఇక అక్కడ రాజకీయ విమర్శలు చేయడానికి వైసీపీకి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది.