కూటమి ప్రభుత్వ పాలకులు, మంత్రుల మనసత్వం పై సర్వీస్ నుండి రిటైర్డ్ అయిన పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎలాంటి కామెంట్లు చేస్తున్నారో తెలుసా.. ఆ కామెంట్లు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీరును తీవ్రంగా తప్పుబట్టేలా ఉన్నాయి. ” మేము చెప్పిన పది పనులు తప్పకుండా చేయండి.. మీరు కూడా నాలుగు పనులు చేసుకోండి..” అని పరోక్షంగా లైసెన్స్ ఇచ్చారనే మాట ఇప్పుడు సచివాలయంలో బాగా వినిపిస్తోంది. ముఖ్యం గా ఈ విధానం ఆర్ధిక శాఖలో అమలవుతుందన్న కామెంట్లనే మాజీలు చేస్తున్నారు. ఆర్ధిఖ శాఖలో ఈ రెండేళ్లలో బాగా అమలయ్యిందట. వేల కోట్ల బిల్లుల చెల్లింపులు జరిగాయి. 5 శాతం నుండి 7, 10 శాతం కమిషనులు చేతులు మారాయట. అది కూడా వైసీపీ అభిమాన కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులలో మాత్రమే. ఈ విషయం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకు తెలియకుండా ఉంటుందా.. అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ బిల్లుల చెల్లింపు విషయం మాత్రం మంత్రి పయ్యావులకు తెలిసే జరుగుతోందని ఆరోపిస్తున్నారు.
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేషి అధికారులతో పాటు ఒక ప్రైవేటు వ్యక్తి ప్రభావం కూడా బాగానే పనిచేస్తున్నాయనే బాగా వినిపిస్తోంది. తాజాగా జరుగుతుందేమిటంటే.. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనేది రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల మాట. సచివాలయంలో ఏం జరుగుతుందో.. ముఖ్యంగా ఆర్ధిక శాఖలో ఏం జరుగుతుందో తెలిసి కూడా చంద్రబాబు మౌనంగా ఉంటున్నారనేది మాజీ ఐఏఎస్‌ల ఆరోపణ. కూటమి ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో కూడా లోకేష్ మాట ఫైనల్ అన్నట్లుగా ఉందని.. చివరికి డిప్యూటీ సీఎం పవన్ నిర్వహిస్తున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖల అధికారులు లోకేష్ మాటే వింటున్నారనేది ప్రధాన ఆరోపణ.
అసలు విషయం ఏమిటంటే.. ఆర్ధిక శాఖలో ఎన్నికలకు ముందే వైసీపీ అభిమాన అధికారి డిప్యుటేషన్‌పై నియమితులయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రెండేళ్ల నుంచి అదే పోస్టులో నిక్షేపంగా, ఎదురు లేకుండా కొనసాగుతూ, నాలుగు రాళ్లు బాగానే వెనకేసుకుంటున్నారట. ఆ అధికారికి మంత్రి పయ్యావుల కేశవ్, ఆ శాఖాధిపతి ఈష్ కుమార్, మంత్రి లోకేష్ ఆశీస్సులు కూడా ఉన్నాయనే ప్రచారం సచివాలయంలో జరుగుతోంది. ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్లు విలువ గల బిల్లులు చెల్లించారో కానీ, వందల కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో ఎవరెవరికి ఎంతెంత ముట్టాయో.. ఇప్పించిన వారికి, తీసుకున్న వారికి, పై వాడికి మాత్రమే తెలియాలి.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి