మద్యం సేవించి వాహనం నడుపరాదు.. అంటూ అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. మద్యం సేవించి వాహనం నడిపితే భారీగా జరిమానా విధిస్తున్నారు కూడా. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు భయపడి చాలా మంది వాహనం నడిపేందుకు కూడా భయపడుతున్నారు. లిమిట్ దాటి మద్యం సేవించినట్లు తేలితే.. 14 రోజుల పాటు శిక్ష కూడా పడుతుంది. ఇక మద్యం సేవించిన వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. అలాగే దాదాపు అన్ని ప్రధాన కూడళ్లల్లో మద్యం తాగి వాహనం నడిపితే జరిగే అనర్థాల మీద పోస్టర్లు, వీడియోల ద్వారా నిరంతరం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కూడా.
మద్యం.. ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వమే ప్రకటిస్తోంది. ఇక మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కితే.. ఫైన్ ఖాయం. అందుకే.. మందుబాబులు పోలీసులకు దొరక్కుండా నానా పాట్లు పడుతుంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన కొందరు బడా బాబులు రోడ్లపై చేసిన హంగామా వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కూడా. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన తర్వాత.. మందుబాబుల పాట్లు చూడాలి.. ఆహా.. కొందరేమో.. నాకు వాళ్లు తెలుసు.. వీళ్లు తెలుసు.. అంటూ తెగ ఫోన్లు చేస్తారు.. మరికొందరేమో.. సార్.. కేసులు ఎందుకు.. ఎంతో కొంత తీసుకుని వదిలేయండి.. అంటూ బతిమాలుతారు.
ప్రస్తుతం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి ఓ టీడీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రమాదాల నివారణ కోసమే తనిఖీలు చేస్తున్నామని పోలీసులు సమాధానమిస్తున్నారు. అయితే సదరు ఎంపీ గారు మాత్రం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదులో రాజకీయాలు కూడా చూడాలంటూ వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. ఏలూరు జిల్లా దిశ సమావేశంలో మందుబాబుల గురించి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ హాట్ కామెంట్స్ చేశారు. తాగి వాహనం నడిపే వారిపై కేసులు పెడతారా అంటూ పోలీసుల తీరుపైన ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల తమ పార్టీకి చెడ్డపేరు వస్తోందన్నారు. తనకు ప్రజా సమస్యల కంటే ఎక్కువగా మందుబాబుల సమస్యల గురించే ఫోన్లు వస్తున్నాయని అందరి ముందే ఎంపీ అసహనం వ్యక్తం చేయడం కాస్త ఆశ్చర్యం కలిగించింది.
ఇదే సమయంలో ఈ విషయంలో రాజకీయాల గురించి ఎంపీ మహేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రూల్స్ అనేవి ఇతర పార్టీలపై చూపించాలని, తమ పార్టీ మండల ప్రెసిడెంట్లపై కాదంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. రూల్స్ అందరికీ ఒకేలా ఉంటే ఎలాగని, తమ కార్యకర్తలకు కేసుల నుంచి ‘ఫ్లెక్సిబిలిటీ’ ఇవ్వాలంటూ విచిత్రమైన రిక్వెస్ట్ కూడా చేశారు. ఓ వైపు చట్టం ముందు అంతా సమానమే అని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదే పదే చెబుతుంటే.. సదరు ఎంపీ గారు మాత్రం.. మా వాళ్లను వదిలేయండి అంటూ చెప్పడం ఏమిటని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. తాగి వాహనం నడిపే వారి వల్ల రహదారిపై వెళ్లే ఇతరులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మందుబాబుల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు, అంగవైక్యల్యానికి గురైన వారు ఎంతో మంది ఉన్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి కూడా ఉంది. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ వద్దని ప్రభుత్వాలు, పోలీసులు మొత్తుకుంటున్నారు. కానీ మన ఎంపీ పుట్టా మహేష్ మాత్రం.. మా పార్టీ వాళ్లు మద్యం సేవించి వాహనం నడుపుతారు.. వాళ్లను ఏమీ అనొద్దు అని పరోక్షంగా.. ఇంకా చెప్పాలంటే.. డైరెక్టుగా పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే..!
