పవన్ ‘OG 2’నా.. నాని ‘బ్లడీ రోమియో’నా..?

సుజిత్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏంటీ..?

Share this :

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే సెన్సేషనల్ డైరెక్టర్ సుజిత్ తదుపరి సినిమా గురించిన సస్పెన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో(Pawan Kalyan) భారీ ప్రాజెక్ట్ ఉంటుందా..? లేక నేచురల్ స్టార్ నానితో అనౌన్స్ చేసిన సినిమా ముందుకు వెళ్తుందా..? అసలు సుజిత్ దారెటు? అనే ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘OG’ మూవీతో సుజిత్ రేంజ్ అమాంతం పెరిగిపోవడంతో, అతని తదుపరి అడుగుపై అందరి కళ్లూ పడ్డాయి.

Also Read: వైభవ్ ను ఆడించకపోతే ముందే చెప్పేయండి..!

ఈ క్రేజ్ నడుస్తుండగానే, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సుజిత్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు, అదిరిపోయే ప్రీ గ్లింప్స్ కూడా బయటకు వచ్చాయి. అయితే ఇది సెట్స్‌పైకి వెళ్లే సమయంలోనే పవన్ కళ్యాణ్ నుంచి సుజిత్ కు మళ్లీ పిలుపు వచ్చినట్లు టాక్. ఈసారి ఏకంగా ‘OG 2’ స్క్రిప్ట్ సిద్ధం చేయమని పవన్ కోరడంతో సుజిత్ తన పూర్తి ఫోకస్‌ను దానిపైనే పెట్టాడని, దీంతో నాని ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్‌లో పడిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Also Read: పిఠాపురం వర్మ, వంగవీటి రాధాకు ఈసారైనా లక్ చిక్కేనా?

ప్రాక్టికల్‌గా చూస్తే నాని ప్రస్తుతం తన కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి కావడానికి మరో రెండు మూడు నెలలు పడుతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ‘OG 2’ వెంటనే పట్టాలెక్కడం కష్టమే. ఒకవేళ పవన్ డేట్స్ ఇప్పట్లో దొరకకపోతే, ఈ గ్యాప్‌లో సుజిత్ మళ్లీ నాని సినిమాను పూర్తి చేస్తాడా లేదా పవన్ కోసమే వెయిట్ చేస్తాడా అనేది టాలీవుడ్‌లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.