అల్లు అర్జున్‌ను వదిలే ప్రసక్తే లేదా..?

బన్నీపై రేవంత్ కు కోపం తగ్గలేదా..?

Share this :

హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్ వద్ద ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటకేసు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు విచారణలో భాగంగా సినీ నటుడు అల్లు అర్జున్ సహా ఇతర నిందితులు నేడు నాంపల్లి కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం షూటింగ్స్, ఇతర పనుల వల్ల తాను కోర్టుకు రాలేనని, ఆన్‌లైన్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు.

Also Read:  కన్నీటితో ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్ బై..!

ఈ కేసులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అల్లు అర్జున్‌ను అస్సలు వదలడం లేదనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో గట్టిగా నడుస్తోంది. అల్లు అర్జున్ దాఖలు చేసిన వర్చువల్ హాజరు పిటిషన్‌ను ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) కోర్టులో తీవ్రంగా వ్యతిరేకించారు. “అల్లు అర్జున్‌కు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వకూడదు, ఆయన ఖచ్చితంగా కోర్టు బోనులో నిలబడాల్సిందే” అంటూ పీపీ గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాయర్ ఇంత పట్టుదలకు పోతుండటం చూస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బన్నీ చుట్టూ ఉచ్చు బిగిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: వైభవ్ ను ఆడించకపోతే ముందే చెప్పేయండి..!

గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలపడం అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ పాత కక్షలను మనసులో పెట్టుకునే.. ఇప్పుడు సంధ్యా థియేటర్ ప్రమాదాన్ని ఆసరాగా చేసుకుని రేవంత్ సర్కార్ అల్లు అర్జున్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తోందనే ఓ వర్గం ఆరోపణలు చేస్తోంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో సెలబ్రిటీలకు వర్చువల్ హాజరుకు అనుమతి ఇస్తుంటారు, కానీ అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరించడం వెనుక పక్కా పొలిటికల్ యాంగిల్ ఉందనే విమర్శలు వస్తున్నాయి. కోర్టు నేడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.