ఆపిల్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఒక అద్భుతమైన వార్త. సాధారణంగా ఆపిల్ కంపెనీ ప్రతి ఏటా ఐఫోన్లలో చిన్న చిన్న మార్పులు మాత్రమే ఇస్తుందనే విమర్శ ఉంది. కానీ, రాబోయే రోజుల్లో ఆపిల్ తన చరిత్రలోనే అతిపెద్ద డిజైన్ ఓవర్‌హాల్‌కు తెరలేపబోతోందని టెక్ వర్గాల సమాచారం. ఐఫోన్ మార్కెట్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తి కాబోతున్న అపూర్వ సందర్భాన్ని పురస్కరించుకుని ఆపిల్ ఒక మైండ్ బ్లోయింగ్ యానివర్సరీ ఎడిషన్‌ను తీసుకురావడానికి ఇప్పటి నుంచే ప్రయోగాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ‘iPhone 20 Pro Max‘ కి సంబంధించిన కొన్ని షాకింగ్ లీక్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
చైనాకు చెందిన ప్రముఖ టెక్ టిప్‌స్టర్ ‘Digital Chat Station‘ లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఆపిల్ కంపెనీ ప్రస్తుతం తన సీక్రెట్ ల్యాబ్స్‌లో 6.96 ఇంచుల భారీ డిస్ప్లే ప్యానెల్‌ను టెస్ట్ చేస్తోంది. దీనిని మార్కెట్లోకి తెచ్చేటప్పుడు రౌండ్ అప్ చేసి “7-ఇంచ్ డిస్ప్లే” గా ఆపిల్ ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్ మోడల్స్ (iPhone 17 Pro Max) 6.9 ఇంచుల డిస్ప్లేతో వస్తున్నాయి కాబట్టి, స్క్రీన్ సైజులో వచ్చే భౌతిక మార్పు చాలా స్వల్పంగానే ఉంటుంది. కానీ, ఈ ఫోన్ యొక్క బెజెల్స్ (స్క్రీన్ అంచులు) పూర్తిగా తొలగించి, కంప్లీట్ బోర్డర్‌లెస్ లుక్ ఇవ్వడం వల్ల ఇది ఐఫోన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిస్ప్లేగా రికార్డు సృష్టించనుంది.
ఈ యానివర్సరీ ఐఫోన్లో కేవలం స్క్రీన్ సైజ్ పెరగడం మాత్రమే కాదు.. అసలు ట్విస్ట్ దాని డిజైన్‌లో ఉంది. ఈ ఫోన్ నాలుగు వైపులా సరికొత్త ‘కర్వ్డ్ గ్లాస్’ టెక్నాలజీతో, ఎక్కడా కంటికి కనిపించే బెజెల్స్ లేకుండా రాబోతోందని సమాచారం. ఫోన్‌ను చేతిలోకి తీసుకుంటే.. ఎక్కడా అంచులు తగలకుండా ఒక సాలిడ్ గ్లాస్ ముక్కను పట్టుకున్నట్లే అల్ట్రా-ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఆపిల్ కంపెనీ ఎప్పటి నుంచో కలలుగంటున్న “ఫుల్ గ్లాస్ ఐఫోన్” విజన్ దీనితో నిజం కాబోతోంది. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ‘బ్లూమ్‌బెర్గ్’ కూడా ఆపిల్ ప్రస్తుతం రెండు డిఫరెంట్ యానివర్సరీ ప్రోటోటైప్స్ పైన చాలా వేగంగా వర్క్ చేస్తోందని స్పష్టం చేసింది.
టెక్ సర్కిల్స్‌లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఆపిల్ తన 20వ వార్షికోత్సవం (2027) మైలురాయిని గ్రాండ్‌గా మార్క్ చేయడం కోసం ‘iPhone 19’ సిరీస్‌ను పూర్తిగా స్కిప్ చేసి, నేరుగా ‘iPhone 20’ సిరీస్‌ను మార్కెట్లోకి తెచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. గతంలో 10వ వార్షికోత్సవం సందర్భంగా ‘iPhone 9’ ని స్కిప్ చేసి నేరుగా ‘iPhone X’ (ఐఫోన్ 10) ని తెచ్చిన చరిత్ర ఆపిల్‌కు ఉంది. అయితే ఈ లోగా, రాబోయే సెప్టెంబర్‌లో ఆపిల్ నుండి మోస్ట్ అవేటెడ్ ‘iPhone 18’ సిరీస్‌తో పాటు ఆపిల్ హిస్టరీలోనే మొట్టమొదటి ‘ఫోల్డబుల్ ఐఫోన్’ కూడా లాంచ్ కానుంది. ఏదేమైనా, ఆపిల్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ లీక్స్‌ను ప్రాథమిక సమాచారంగానే పరిగణించాల్సి ఉంటుంది.