రాహుల్ గాంధీ ముక్కులో రక్తం.. దేశవ్యాప్తంగా పెరిగిన క్రేజ్..!

కాంగ్రెస్ ఇమేజ్ పెరిగిందా..?

Share this :

ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన విద్యార్థుల నిరసన ప్రదర్శనలు, కాంగ్రెస్ మెరుపు ధర్నాకు సంబంధించిన ఒక ద్రవించే దృశ్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. నీట్ పేపర్ లీకేజీలపై విద్యార్థులకు మద్దతుగా రోడ్డుపైకి వచ్చిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకునే క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఆయన ముక్కుపై గాయం కావడం, అక్కడ నుంచి రక్తం కారడం చూసి కాంగ్రెస్ శ్రేణులతో పాటు యావత్ దేశ ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒక జాతీయ పార్టీకి అగ్రనేత, పైగా లోక్‌సభ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తిపై ఇంతటి దురుసు ప్రవర్తనా అంటూ సామాన్యుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Also Read: విద్యార్థుల ఆగ్రహాన్ని కేంద్రం తక్కువ అంచనా వేసిందా..?

ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వంపై, ఢిల్లీ పోలీసులపై దేశవ్యాప్తంగా తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమవడంతో బీజేపీ సోషల్ మీడియా వింగ్ తక్షణమే నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. రాహుల్ గాంధీ గాయాన్ని ఒక పెద్ద ఇష్యూ చేయకుండా కవర్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఈ నిరసనల్లో కాంగ్రెస్ కార్యకర్తలు శృతిమించారని, పోలీసులపై దాడికి దిగారంటూ కొన్ని వీడియోలను షేర్ చేసింది. అంతేకాదు, ఇదంతా విద్యార్థుల ఉద్యమం కాదని, దేశంలో అల్లర్లు సృష్టించేందుకు జరుగుతున్న “సంఘ విద్రోహ చర్యలు” అంటూ బీజేపీ ఐటీ సెల్ సరికొత్త ప్రచారానికి తెరలేపింది. ప్రతిపక్షాలు కావాలనే డ్రామాలు ఆడుతున్నాయని కొట్టిపారేసే ప్రయత్నం చేసింది.

Also Read: కాపులు జగన్ పాలేరులా.. ఊడిగం చేయాలా..?

అయితే, బీజేపీ సోషల్ మీడియా చేసిన ఈ ఎదురుదాడి వ్యూహాలు ప్రజా క్షేత్రంలో పెద్దగా ఫలించలేదు. రాహుల్ గాంధీ ముక్కుపై రక్తం చిందిన దృశ్యాలు, ఆయనను పోలీసులు రోడ్డుపై ఈడ్చుకెళ్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో విపరీతంగా వైరల్ అయ్యాయి. సామాన్య నెటిజన్లు సైతం అధికార పార్టీ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. యువత భవిష్యత్తు కోసం, విద్యార్థుల న్యాయమైన పోరాటం కోసం రాహుల్ గాంధీ నేరుగా మైదానంలోకి దిగి రక్తం చిందించారనే భావన జనాదరణ పొందింది. ఈ ఒక్క ఘటనతో నిన్నటి రోజున రాహుల్ గాంధీ ఇమేజ్ మరియు గ్రాఫ్ ప్రజల్లో అమాంతం పెరిగిపోయింది. ఒక బలమైన, పోరాడే నాయకుడిగా ఆయన ఇమేజ్ సరికొత్త శిఖరాలకు చేరిందని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

leave a reply