అసలు ఏంటి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్‌మెంట్ బిల్ 2026..?

కఠిన శిక్షలు, భారీ జరిమానాలతో కొత్త చట్టం!

Share this :

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీకేజీ ఉదంతం, ఆ తర్వాతి భారీ విద్యార్థి ఉద్యమాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించింది. లోక్‌సభలో విపక్షాల తీవ్ర నిరసనలు, చర్చల మధ్య ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్‌మెంట్ బిల్, 2026’ (యాంటీ పేపర్ లీక్ బిల్) పార్లమెంట్ ముందుకు వచ్చింది. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరియు ఇతర విద్యార్థి సంఘాలు చేసిన భారీ నిరసనల దెబ్బకు నాటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షల్లో జరిగే అక్రమాలను, వ్యవస్థీకృత ముఠాలను కఠినంగా అణచివేసేలా మరింత కఠినమైన శిక్షలు, జరిమానాలతో ఈ కొత్త బిల్లును రూపొందించారు.

Also Read: రిటైర్డ్ అధికారి అంటే ఎందుకు సార్ అంత ముద్దు..?

ఈ కొత్త సవరణ బిల్లు ప్రకారం పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు ఇచ్చే కనీస జైలు శిక్షను 3 ఏళ్ల నుండి 5 ఏళ్లకు పెంచారు, ఇది గరిష్టంగా 10 ఏళ్ల వరకు పొడిగించవచ్చు. అలాగే గరిష్ట జరిమానాను రూ. 10 lakhs నుండి రూ. 50 lakhs కు పెంచారు. పరీక్షలు నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్లు అక్రమాలకు పాల్పడితే విధించే జరిమానాను రూ. 1 కోటి నుండి ఏకంగా రూ. 5 కోట్లకు పెంచడమే కాకుండా, ఆ సంస్థల మేనేజీరియల్ సిబ్బందికి కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష విధించేలా నిబంధనలు మార్చారు. పేపర్ లీక్ ముఠాలు, ఆర్గనైజ్డ్ క్రైమ్స్‌కు పాల్పడే వారికి కనీస జైలు శిక్షను 7 ఏళ్లకు పెంచడమే కాకుండా, కనీస జరిమానాను రూ. 1 కోటి నుండి రూ. 10 కోట్లకు భారీగా పెంచడం గమనార్హం.

Also Read: కెనడాలో భారత విద్యార్థులకు వర్క్ పర్మిట్ షాక్..!

కేసుల వేగవంతమైన విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఈ కోర్టుల పరిధిలో దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేసి, మూడు నెలల లోపే ట్రయల్‌ను ముగించాల్సి ఉంటుంది. ఈ చట్టం పరిధిలోకి వచ్చే అన్ని రకాల పరీక్షల అక్రమాల నేరాలను నాన్-బెయిలబుల్ గా మార్చారు. ఈ బిల్లు పరిధి కింద యూపీఎస్సీ (UPSC), ఎస్‌ఎస్‌సీ (SSC), ఆర్‌ఆర్‌బీ (RRBs), ఐబీపీఎస్ (IBPS) తో పాటు నేషనల్… టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు కఠిన రక్షణ లభించనుంది.