ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారిన రెండు విషయాల్లో ఒకటి జీ-20 సదస్సు ఆహ్వానపత్రంపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడం మరియు తమిళనాడు మంత్రి ఐనటువంటి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఈ రెండింటి గూర్చి మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి స్పందించాలని కేంద్రమంత్రులకు ప్రధాని మోడీ చెప్పారు.అయితే ఈ మేరకు జాతీయ మీడియాలో చాలా కథనాలు కూడా వచ్చాయి.
నేడు ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అందులో ‘భారత్’ అనే పదాన్ని ప్రధాని మోడీగారు మెయిన్ గా ప్రస్తావించారని తెలిసింది. భారత్ అనే విషయంపై ఎక్కువగా స్పందించవద్దని, దానికి సంబంధిత వ్యక్తులు మాత్రమే మాట్లాడాలని కేంద్రమంత్రులకు సూచించారు.
అలాగే ఆ అంశంతో పాటు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన కామెంట్స్ ను తిప్పికొట్టాలని ఆయన పరోక్షంగా సూచించారు. చరిత్ర లోతుల్లోకి వెళ్లకుండా, రాజ్యాంగం ప్రకారం వాస్తవాలను ప్రజలకు చెప్పాలని, సమకాలీన అంశాలపై మాట్లాడాలని,వివాదాస్పద విషయాలకు చోటు ఇవ్వవద్దని సూచించారని తెలిసింది.
