ఏపీ ప్రభుత్వం పై షాకింగ్ వ్యాఖలు చేసిన తెలంగాణ మంత్రి….!!

Share this :

తెలంగాణ మంత్రి ఐనటువంటి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆంధ్రప్రదేశ్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గారిని ఉద్దేశించి ఒకప్పుడు ఆయన అన్న మాటలు గుర్తు చేసారు.తెలంగాణ వస్తే కరెంటు సమస్యలు వస్తాయని కిరణ్ కుమార్ గారు అన్నారని గుర్తు చేసారు.అయితే ప్రస్తుతం దానికి భిన్నంగా తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని పక్క రాష్ట్రము ఐనా ఏపీలోనే విద్యుత్‌ సరిగా ఉండటం లేదని అక్కడి ప్రజలు తీగలపై హ్యాపీగా దుస్తులు ఆరేసుకునే పరిస్థితులు ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు.

ఆయన బుధవారం వరంగల్‌ జిల్లా సంగెం మండలంలోని గుంటూరుపల్లి, కాపులకనపర్తి మరియు గవిచర్ల గ్రామాల్లో పరకాల ఎమ్మెల్యే ఐనా ధర్మారెడ్డిగారి తో కలిసి ఆయన పర్యటించి దాదాపు పాతిక కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. దాంట్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మంత్రి మాట్లాడారు.

అయితే ఆయనే గతంలో చేసిన వ్యాఖ్యలు ఇంకా మరవక ముందే మరలా ఆంధ్రప్రదేశ్ పై చేసిన వ్యాఖ్యలు ఇపుడు అక్కడి మంత్రులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆయన ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మి తెలంగాణలో వంద ఎకరాలు కొనుగోలు చేశారని కానీ ఇపుడు ఇక్కడ పరిస్థితి మారిందని ప్రస్తుతం ఇక్కడ ఎకరం అమ్మితే వచ్చే డబ్బులతో ఆంధ్రాలో వంద ఎకరాల భూములు కొనుగోలు చేసే స్థాయికి రాష్ట్రం డెవలప్ యిందని చెప్పుకొచ్చారు.అరవై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో సాధ్యం కాని చాలా అభివృద్ధి పనులు ఈ తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్‌ అభివృద్ధి పరిచారని అన్నారు. అయితే సీఎం కేసీఆర్ తన నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో నందమూరి తారక రామారావు తర్వాత ప్రజా సంక్షేమం కోసం తపించే మనిషి అని ఇందుమూలంగా చెప్పుకొచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు