నుండి సీఎం కేసీఆర్ అధ్యక్షతన నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఆ రాష్ట్ర ప్రభుత్వ గవర్నర్ తమిళ సై కు మధ్య విభేదాలు నడుస్తున్న సంగతి మనకు విధితమే. తాజాగా ఇప్పుడు ప్రగతి భవన్ – రాజ్ భవన్ ల మధ్య జరుగుతున్న సీరియస్ వార్ చల్లరుతుందా..? అనే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తాజాగా స్థానిక మీడియాతో మాట్లాడిన తెలంగాణ గవర్నర్ తమిళ సై గడిచిన కొంత కాలం క్రితం టీఎస్ ఆర్టీసీ బిల్లు పై అనవసరమైన రాద్దాంతం చేశారని, అది చాలా సున్నితమైన అంశం అని, ప్రస్తుతం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేయడానికి సంతకం చేస్తానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు కేసీఆర్ రాజకీయంగా చాలా అనుభవజ్ణులు అని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం వైద్య రంగంలో అద్భుతంగా రాణిస్తుందని, సీఎం కేసీఆర్ నుండి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై మీడియాకు తెలిపారు.
తాజాగా గవర్నర్ తమిళ సై చేసిన ఈ వ్యాఖ్యలతో రాజ్ భవన్ కు ప్రగతి భవన్ కు మధ్య ఏర్పడిన గ్యాప్ కాస్త తగ్గుముఖం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.
