ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నా జీ-20 సదస్సులో పీఎం నరేంద్ర మోదీ ముందు “భారత్” నేమ్ తో నేమ్ ప్లేట్ కనిపించింది. దీంతో ఇండియాఅనే పేరును తొలగించి భారత్‌గా మార్చబోతున్నారనే అటు వంటి వార్తలు నిజం అనే తెలుస్తుంది.జీ20 సదస్సు కి వచ్చిన అతిరధులను విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపించిన లేఖల్లో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి.ప్రత్యేక సమావేశాల అజెండా గూర్చి అడుగుతు కాంగ్రెస్ అధినేత్రి ఐనా సోనియా గాంధీ మోదీకి లేఖ కూడా రాసారు.
జీ20 సమావేశాల కోసం న్యూఢిల్లీ చేరుకున్న తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డైరెక్ట్ గా మోదీ నివాసానికి వెళ్లారు. అక్కడ బైడెన్‌కు ఘన స్వాగతం పలికిన ప్రధాని మోదీ ఆయనతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం దాదాపు 50 నిమిషాల జరిగింది.ఈ సమావేశంలో అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ ప్రత్యేక చొరవ తీసుకోని ఆఫ్రికన్ యూనియన్ ను సైతం భాగస్వామిని చేసింది. అయితే జీ20 దేశాల కూటమిలోకి ఆఫ్రికన్ యూనియన్ ను పర్మినెంట్ సభ్యత్వ దేశంగా చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
