మోదీ విధానాన్ని మెచ్చుకున్న కాంగ్రెస్ మాజీ ప్రధాని

Share this :

గత సంవత్సరంలో ప్రారంభం ఐనా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై ప్రధాని మోదీ సర్కారు అవలంభిస్తున్న వైఖరి పట్ల మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మెచ్చుకున్నారు.ప్రధాని మోదీ ఒకవైపు శాంతి కోసం పాటుపడుతూనే,మరోవైపు దేశం యొక్క సార్వభౌమాధికారానికీ, ఆర్థిక ప్రయోజనాలకూ ఇంపార్టెన్స్ ఇవ్వడమే సరైన వైఖరి అని మన్మోహన్ సింగ్ గారు అన్నారు.

అయితే ఈ విషయంలో భారత్‌ మాత్రం సరైన దారినే సెలెక్ట్ చేసుకుందని ఆయన కొనియాడారు.అయితే ఆయన శనివారం జీ-20 సదస్సు స్టార్ట్ కానున్న తరుణంలో ఒక కాంగ్రెస్‌ నేత నుంచి ప్రధాని మోదీకి ఒక అనూహ్య మద్దతు లభించడం అనేది ఒక విశేషం అని బీజేపీ ప్రతినిధులు అంటున్నారు. మన్మోహన్ గారు ఒక ఇంగ్లిష్‌ దినపత్రికకు శుక్రవారం ఇంటర్వ్యూ ఇచ్చారు దాంట్లో భాగంగానే ఆయన ప్రపంచ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి అంటూ కామెంట్స్ చేసారు.

ఇలాంటి మార్పులకు అనుగుణంగా తన పాత్రను పెంచుకుంటూ అక్కడి పరిస్థితులను సానుకూలపరుచుకోవడం చాలా అవసరం అని అన్నారు. ఇటువంటి పాత్రను భారత్‌ మాత్రమే పోషించగలదు అని నేను నమ్ముతున్నాను అని అన్నారు.ప్రస్తుతం భారత్‌ ఫ్యూచర్ పట్ల తనకు ఇంకా ఆందోళన లేదని చాలా ఆశాభావంతో ఉన్నానని తెలిపారు. ఇకపోతే మన్మోహన్సింగ్ ఇటీవల భారత్ ప్రయోగించిన చంద్రయాన్‌-3 మిషన్‌ ప్రాజెక్ట్ లో పాలు పంచుకున్న ప్రతి ఇస్రో శాస్త్రవేత్తలకు తన అభినందనలు తెలిపారు.