ఒంటరితనం భరించలేక యువతి ఆత్మహత్య!

Share this :

ఇటీవల చాలా మంది చిన్న విషయాలకే ఎంతో డిప్రేషన్ కి లోనై తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒంటరితనం భరించలేక ఓ యువతి దారుణమైన నిర్ణయం తీసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట బెజ్జంకి కి చెందిన నూనె ధనూజ(21) ఈ మద్య బ్రాంచ్ పోస్ట్ ఉమెన్ గా ఉద్యోగం పొందింది. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా చందుర్తి మండలం మర్రిగడ్డకు వచ్చి ఉంటుంది.

రెండు నెలలుగా మర్రిగడ్డలో కిరాయి ఇంట్లో ఉంటూ జీవిస్తుంది. గత కొంత కాలంగా ధనూజ వరుసకు బావ అయిన రాకేశ్ ని ప్రేమిస్తుంది. కొంతకాలంగా తాను ఒంటరిగా ఉండటం వల్ల డిప్రేషన్ లోకి వెళ్తున్నా అని తన బావతో చెప్పడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి రమ్మన్నాడు. ఈ క్రమంలో గత నెల31 న రాజీనామా పత్రాన్ని సమర్పించింది. స్థానికంగా లేకపోవడంతో ధనూజ శుక్రవారం మర్రిగడ్డకు సామాన్లు తీసుకువెళ్లడానికి వచ్చింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో తన బావకు ఫోన్ చేసి తల తిప్పుతుందని చెప్పి ఫోన్ కట్ చేసింది.

కండారు పడ్డ రాకేశ్ స్థానికంగా ఉంటున్నవాళ్లకు ఫోన్ చేసి ధనూజ రూమ్ కి వెళ్లి చూడాల్సిందిగా కోరాడు. ఓ వ్యక్తి ధనూజ ఇంటికి వెళ్లి తలుపు తట్టగా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇంటి పైకి వెళ్లి పై కప్పు నుంచి చూడగా అప్పటికే ధనూజ ఉరివేసుకొని ఉండటం గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ధనూజ తల్లి మమత ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణం అని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.