చంద్రబాబు అరెస్ట్.. వైసీపీ భూస్థాపితం కావడం ఖాయం: ఎంపీ రఘురామ కృష్ణంరాజు

Share this :

సిల్క్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన రిమాండ్ లో ఉంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మీడియా మొత్తం ఈ అంశంపైనే ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కేసులో నూటికి నూరు శాతం దోషి తమ ప్రభుత్వమే అని తేల్చారు. అసలు ఈ కేసులో ఫైలు లేకుండా కేసు నమోదు చేయడం ఏంటీ? అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ తో తమ ప్రభుత్వం భూస్థాపితం కావడం ఖాయం అన్నారు.

నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కీమును ఎంతగానో ప్రోత్సహించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కీం ని ఆయన అమలు చేశారు. సీల్క్ డెవలప్ మెంట్ స్కీమ్ గుజరాత్ లో ఒప్పయితే.. మరి ఏపీలో తప్పు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. కర్ణాటక, తమిళనాడు, మధ్య ప్రదేశ్ లో ఇదే స్కీమ్ అమలు చేశారు. మరి ఆ రాష్ట్రాలు తప్పు చేశాయా? ఈ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి అన్నారు. ఎన్నికల సమయంలో నవరత్నాల అని చెప్పారు.. అవి సరిగా అమలు అవుతున్నాయా? 7వేల కోట్లు పెట్టి మీటర్లు పెట్టారు.. అందులో 3 వేల కోట్లు మింగేశారు అని అన్నారు. అదంతా ప్రజాధనం కాదా అని అన్నారు.

భారత్ లో బెస్ట్ స్టేట్ ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ అవార్డు కూడా జగన్ వచ్చి కొత్తలో తెగ మెచ్చుకున్నారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ పూర్తి అధ్యాయంన చేసిన తర్వాతే గుజరాత్ లో ఈ స్కీమ్ ఏర్పాటు చేశారు. జగన్ చర్యలు ఇప్పుడ ప్రధాని మోదీని అవమానించినట్లే అన్నారు. జగన్మోహన్ రెడ్డి చర్యలతో మా పార్టీ నేతలంతా లో లోపల కుమిలిపోతున్నారు. ఎరవేసి తిమింగలాన్ని పట్టాలను చూస్తే… తానే బలైపోతానన్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి చర్యలను పరిశీలిస్తే విస్మరించినట్లు స్పష్టమవుతుంది. వ్యక్తిగత కక్షను తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో స్కామ్ జరిగిందని అరెస్టు చేసి జైల్లో వేయడాన్ని రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో నిరసిస్తున్నారన్నారు.

రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 35 శాతం ఓటు బ్యాంకు ఉంటే, తెలుగుదేశం పార్టీకి కూడా 35% ఓటు బ్యాంకు ఉంది. ఇక మిగిలిన తటస్థులలో 95% మంది ఇప్పుడు చంద్రబాబుకే తమ మద్దతు అని బాహాటంగానే చెబుతున్నారు. ఐటీ ప్రొఫెషనల్స్, న్యాయవాదులు, వైద్యులు ఒక్కరేమిటి ప్రజాస్వామ్య హితాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ వి ఆర్ విత్ యు చంద్రబాబు అని అంటున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని పేర్కొన్నారు. పిచ్చి పిచ్చి కేసులు పెట్టీ రాష్ట్రాన్ని తగలపెడుతున్నారు. ఒక ప్రతిపక్ష నేత, మాజీ సీఎం నే ఇలా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటీ అని ప్రశ్నించారు. సొంతపార్టీపైనే ఎంపీ రఘురామ చేసి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో స్కామ్ జరిగిందని పివి రమేష్ చెప్పినట్లుగా ఓ ఛానల్ లో పదే పదే ప్రసారం చేశారని, ఇప్పుడు అదే పివి రమేష్ నిజాలను మాట్లాడితే జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. మీడియా ముందుకు వచ్చి నిజాలను మాట్లాడిన పివి రమేష్ ఇంటికి సిఐడి పోలీసులు వెళ్లినట్లు తెలిసింది. ఒకవేళ పీవీ రమేష్ ను అరెస్టు చేస్తే, ఇప్పటికే గాలిలో దీపం లా ఉన్న ఈ కేసు ఆరిపోవడం ఖాయమన్నారు. 1964 లో విడుదలైన ఆత్మబలం చిత్రాన్ని చూసి అందులో సీనియర్ నటుడు జగ్గయ్య పాత్ర సమకాలీన రాజకీయాలలో ఏ నేతకు దగ్గర పోలికలు ఉన్నాయో చెప్పాలని రఘురామ కృష్ణంరాజు ప్రజలను కోరారు.