డెవిల్ మూవీ డైరెక్టర్ పేరు మార్పు.. కారణం అదేనా..?

Share this :

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ పీరియడ్ ఫిలిం ‘డెవిల్’. నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామా ప్రొడక్షన్ లో ఈ సినిమా ప్రారంభం అయ్యింది. ఆ మధ్య వచ్చిన గ్లిమ్స్ లో డైరెక్టర్ పేరు లేదు.కేవలం ఏ ఫిల్మ్ బై అభిషేక్ పిక్చర్స్ అని మాత్రమే ఉంది. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో కూడా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామా అని పేరు మారింది. ఈ విషయం పై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. గతంలో నవీన్, అభిషేక్ కలిసి బాబు బాగా బిజీ అనే సినిమాను తీశారు. ఆ సినిమా ప్లాప్ నిలిచింది.ఆ తరువాత నవీన్ ఆహా లో సిన్ అనే వెబ్ సిరీస్ తీశారు.

నామా నవీన్ ని నమ్మి శ్రీకాంత్ విస్సా (పుష్ప రైటర్) తెచ్చిన డెవిల్ స్క్రిప్ట్ అతనికి అందించాడు.ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి అనే దాని పై ప్రొడ్యూసర్ కి సంబంధించిన వాదన ఇలా వుంది.”మొదటి షెడ్యూల్ లోనే ఈ సినిమాను నవీన్ హేండిల్ చెయ్యడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడని, ఆర్టిసులు, టెక్నిషన్స్ కంప్లయింట్స్ బాగా ఎక్కువయ్యి ప్రొడ్యూసర్ మీద ప్రెషర్ ఎక్కువైందని సమాచారం.. 40 కోట్ల సినిమా కావడం తో రిస్క్ తీసుకోలేక స్వయంగా ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ అయిన అభిషేక్ నామా ఈ సినిమా బాధ్యతలు తీసుకుని సినిమా దాదాపుగా పూర్తి చేశారని సమాచారం.అయితే లాస్ట్ షెడ్యూల్ కనుక పూర్తి చేస్తే సినిమా పూర్తి అవుతుందట.

అభిషేక్ నామా ఫ్యామిలీ రెండు జనరేషన్స్ గా ఇండస్ట్రీలో ఉంది. దానికి తోడు ఆయన సినిమాల ప్రొడక్షన్ డిజైన్ లో కూడా పూర్తిగా వర్క్ చేస్తారు.అలాగే ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ కావడంతో ఈజీగానే పని ముగిసిందని సమాచారం.ముందు సైలెంట్ గా పని పూర్తి చేద్దాం అనుకున్నా కానీ ఆ తరువాత ఇప్పుడు శ్రేయోభిలాషుల సూచన మేరకు పేరు మార్పు చేసినట్లు సమాచారం.