జగన్ చేసింది పిచ్చిపని అని వైసీపీ వాళ్ళే అంటున్నారు: నన్నపనేని రాజకుమారి

Share this :

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను యావత్ ప్రపంచం గమనిస్తోందని, చంద్రబాబు కు ఉన్న పేరు ప్రఖ్యాతులు, ఆయనకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం తెలివితక్కువగా వ్యవహరించాయ ని టీడీపీ సీనియర్ నేత, మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. సీఎం జగన్ ప్రజల్లోకి  ఏ ముఖం పెట్టుకొని వెళ్తాడని అని అధికారపార్టీ నేతలు భయపడుతున్నారు. తమ అధినేత చేస్తున్న పనుల వల్ల జనాల్లోకి వెళ్లాలంటేనే భయం వేస్తుందని ఆవేదన చెందుతున్నారని నన్నపనేని అన్నారు. భువనేశ్వరి మాటలు చాలా గొప్పగా ఉన్నాయి.. హుందాతనం, పరిణితితో కూడిన ఆమె వ్యాఖ్యలపై ప్రతి మహిళా ఆలోచించాలి అన్నారు.

ఆమెమాటలు విన్నాక మాకు కూడా చాలా శక్తి, మనోధైర్యం వచ్చింది. చంద్రబాబునాయుడి లాంటి నాయకుడు భోజనంచేయడానికి కనీసం చిన్నబల్ల కూడా ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వం ఆయనపై ఎంత కక్షతో ఉందో అర్థమవుతోందని అన్నారు. అసెంబ్లీ నుంచి టీడీపీసభ్యుల్ని బయటకు పంపించిన అధికారపార్టీ సభ్యులు కుప్పిగంతులతో ముఖ్యమంత్రి భజన చేస్తున్నారు. ఎవరూ ధైర్యంగా జగన్ రెడ్డి చేసింది తప్పని చెప్పలే ని దుస్థితిలో ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి చేసిన పనిని సొంతపార్టీ వారే పిచ్చిచేష్టగా అభివర్ణిస్తున్నారు. జగన్ రెడ్డి చేసిందానికి మేం ప్రజలముందుకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యేలే వాపోతున్నారు. పారిపోయాడంటున్న వారు.. సింహం త్వరలోనే జూలు విదిలించి బయటకు వస్తుందని తెలుసుకుంటే మంచిది.

టీడీపీ యువనేత ధాటికి తట్టుకోలేకనే ఈ ప్రభుత్వం యువగళం యాత్రను అడ్డుకోవడానికి చేయాల్సిన కుట్రలన్నీ చేసింది. ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటు ప్రపంచం మొత్తం చంద్రబాబుకి అండగా ఉందని తెలుసుకోండి. మహిళలంతా భువనేశ్వరి పిలుపునకు స్పందించి, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, చంద్రబాబుని విడుదలచేసేవరకు ఈ దుర్మార్గపు ప్రభుత్వంపై పోరాడాలి.” అని రాజకుమారి పిలుపునిచ్చారు.