స్కిల్ డెవెలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయాల కీలకంగా మారాయి. జగన్ తీరుపై సొంతపార్టీ నేతలే నిరుస్సాహంగా ఉన్నారని.. భవిష్యత్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్తే ప్రజల్లో ఎలాంటి సమాధానం చెప్పాలని మదన పడుతున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రాజ్యాంగం పై కక్షగట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ, అందులోని ప్రతి నిబంధనకు తూట్లు పొడుస్తోందని విమర్శించారు. రాజ్యాంగంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేశారని, ప్రజాప్రతినిధులుగా తాము కూడా ప్రమాణం చేశామని.. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలను గురించి ఉండబట్ట లేక ప్రశ్నిస్తే వాళ్లు వీళ్ళ చేత తిట్టించడమే కాకుండా, ఇంకా మొండిగా ప్రశ్నించిన వారిని పోలీసుల చేత కొట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని చెబితే, ఉద్యోగులంతా మా పార్టీకి మద్దతునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి, నా ప్రస్తుత పార్టీకి 10 శాతం వ్యత్యాసం ఉందని అనుకుంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో, ఆ వ్యత్యాసం అన్నదే ఇప్పుడు లేకుండా పోయింది .
గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపికి 27% పోస్టల్ ఓట్లు పోలు కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోస్టల్ ఓట్లు అధికంగా వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు ఓట్లు 50 లక్షల పైచిలుకు ఉంటాయి. ఇప్పుడు వారంతా మా పార్టీకి వ్యతిరేకమే. రానున్న ఎన్నికల్లో ఒక్కరు కూడా ఓటు వేసే పరిస్థితి లేదని రఘు రామ కృష్ణంరాజు అన్నారు. అంతేకాదు అంగన్వాడి టీచర్లు, మహిళలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు.
