ఏపీ లో కొత్త విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం….!!

Share this :

దేశంలో మోదీ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థను ఇంకా బలోపేతం చేయాలనే విధంగా ఆలోచిస్తూ కీలక పనులకు శ్రీకారం చూడ్తు ముందుకు దూసుకుపోతుంది. దాంట్లో భాగంగా గానే మధ్య తరగతి కుటుంబానికీ నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు కూడా చేపడుతుంది.వాటి కానుగుణంగా వివిధ రాష్ట్రాలకు 87 కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసింది.అయితే ఈ విద్యాలయాలు అనేవి వివిధ రాష్ట్రలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్ ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ పేర్లను ఈ లిస్ట్ లో చేర్చింది కేంద్ర ప్రభుత్వం. దాదాపుగా అన్ని రాష్ట్రాల పేర్లూ ఈ లిస్ట్‌లో పొందుపరిచింది.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కి మాత్రం  ఏకంగా ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.  రాష్ట్రానికి కేటాయించిన ఈ ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు- అనకాపల్లి, అన్నమయ్య రాయచోటి జిల్లా మదనపల్లి మండలంలోని వలసాలపల్లి, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం, పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని తాళ్లపల్లిల్లో ఏర్పాటు కానున్నాయి.అలాగే ఎన్టీఆర్ జిల్లా నందిగామ, పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని రొంపిచర్ల, ఏలూరు జిల్లా నూజివీడు, నంద్యాల జిల్లా డోన్‌లల్లో కొత్తగా కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఇవి గనక నిర్మించినట్లు అయితే దీనితో కేంద్రీయ విద్యాలయాల సంఖ్య 35 నుంచి 43కు పెరగనుంది.ఇదంతా విద్య వ్యవస్థ పై ఉన్న జగనన్న ప్రభుత్వానికి నమ్మకం అని చెప్పవచ్చు.