RRR Rachabanda: ‘టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తుంది.. చరిత్ర పునరావృతం అవుతుంది’

'కురుక్షేత్రంలో పాండవులే నెగ్గుతారు.. పవన్-చంద్రబాబు కృష్ణార్జునులు..' సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు కౌంటర్‌

MP raghu rama krishnam raju in Rachabanda MP raghu rama krishnam raju in Rachabanda
Share this :

అమరావతి, అక్టోబర్ 3: ‘మేము కలిశాం… కలిసే పోటీ చేస్తాం. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu Arrest) కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ అంగీకరించారన్న డిఫెరెన్స్ మినహా ఆయనతో మరే ఇతర విభేదాలు లేవు. ఈసారి ఎటువంటి విభేదాలు ఉండవని కచ్చితంగా చెప్పగలనని’ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేసినట్లు నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు (MP Raghurama Krishnam Raju Rachabanda) తెలిపారు. తెదేపా, జనసేన కలిసే పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ కుండ బద్దలు కొట్టినట్లు పునరుద్ఘాటించారు. ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలని అధికార పార్టీ నాయకులు చేయని ప్రయత్నం అంటూ లేదన్నారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంగా తేల్చి చెప్పిన తర్వాత అయినా వైఎస్సార్‌సీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. ప్రజలను ఇంత దారుణంగా హింసిస్తూ, పిచ్చి పనుల ద్వారా ప్రజా కంఠక పాలన కొనసాగించడం దారుణమని, అసలు ఒక మనిషికి అంత డబ్బులు అవసరమా? మానసిక రుగ్మత కలిగినవారే ఈ రకంగా ప్రజాధనాన్ని దోచుకుంటారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారన్నారు. ప్రముఖ మానసిక తత్వ శాస్త్రవేత్త సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ పుస్తకాలను పవన్ కళ్యాణ్ చదివారని గతంలో కూడా చెప్పాను. ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ పుస్తకాలలో పేర్కొనడం జరిగింది. ఆ పుస్తకాలను చదివిన వారు మానసిక రుగ్మతతో బాధపడుతున్న వారిని ఇట్టే గుర్తించగలరు. మానసిక రుగ్మతతో బాధపడే రోగి.. చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తారు. ముఖ్యమంత్రి చెబుతున్నట్లుగా పేదలు, పెత్తందారులకు మధ్యయుద్ధమని, తాను పేదల పక్షపాతినని చెప్పుకున్నట్లుగా అని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు.

Also Read: Chandrababu Naidu Arrest: అరెస్టు వెనుక అదృశ్య హస్తం? అక్టోబర్ 3పైనే ఆశలన్నీ?

కురుక్షేత్రంలో పాండవులే నెగ్గుతారు.. భారతం గురించి కూడా కొంత తెలుసుకో

మహాభారతం అంటే కౌరవులు పాండవుల మధ్య యుద్ధం. ముఖ్యమంత్రి జగన్‌హన్ రెడ్డికి కౌరవులు ఎంతమంది, పాండవులు ఎంత మంది అనే విషయం తెలుసునని తాను అనుకోవడం లేదన్నారు. జనసేన, తెదేపా కలయిక మహాభారత యుద్ధంలోని పాండవులతో పవన్ కళ్యాణ్ పోల్చారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ముఖ్యమంత్రి కూడా తరచూ… ఆ చంద్రబాబు నాయుడు, దత్త పుత్రుడు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 రాజగోపాల్ నాయుడు అని అంటుంటారని పేర్కొన్నారు. పాండవుల మాదిరిగా ఐదు మంది లెక్క సరిపోయింది. రానున్న ఎన్నికల్లో ఎలాగూ జగన్‌హన్ రెడ్డి, 50 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వనని చెబుతున్నారు.. మిగిలిన 100 ఎమ్మెల్యేల లెక్క కౌరవులతో సరిపోయింది. దుర్యోధనుడు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శకుని కూడా ఎవరో అందరికీ తెలిసిందే. జగన్‌మోహన్ రెడ్డి కురుక్షేత్ర యుద్ధం గురించి తెలుసుకున్నందుకు సంతోషిస్తున్నాను. భారతం కూడా తెలుసుకోవాలని సూచిస్తున్నాను. కురుక్షేత్ర యుద్ధంలో నెగ్గింది కౌరవులని జగన్‌మోహన్ రెడ్డి అనుకుంటున్నారేమో… మీరు తరుచూ చెప్పే ఐదు పేర్ల పాండవులే నెగ్గుతారు. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో కృష్ణార్జునలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు అయితే, ఆ టైముకు నాలాంటి భీముడు కూడా వారి వెంటే ఉంటాడు. నువ్వు పంపించకపోయినా నేనే వెళ్ళిపోతాను. చరిత్ర పునరావృత్తం కావడం ఖాయం. కౌరవులు ఓడిపోయి పాండవులు నెగ్గుతారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. మా పార్టీకి 15 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదని నేను చెప్పినట్లుగానే, పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ప్రస్తుతానికి ఈ పరిస్థితి ఉండగా, అక్టోబర్ 11వ తేదీన సుప్రీంకోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ అనంతరం పరిస్థితులు మారవచ్చు. అధికార పార్టీ పరిస్థితి మరింత దిగజారి పోవచ్చు. అనారోగ్య కారణం వల్ల వైయస్ భాస్కర్ రెడ్డి కి కస్టడీ బెయిల్ మంజూరు చేయగా, మరో రెండు నెలల పాటు బెయిల్ పొడగించాలని ఆయన కోరడం విడ్డూరంగా ఉంది. అదేదో రెండు రోజులు పొడిగించమన్నట్లుగా ఆయన రెండు నెలలు పొడిగించాలని అడిగారని అపహాస్యం చేశారు.

Also Read: ‘లోకేష్‌పై పెట్టిన కేసుల్లో పసలేదు.. సుప్రీంలో బాబుకు విజయం ఖాయం’

కదనరంగంలోకి త్వరలోనే చంద్రబాబు, లోకేష్

నాలుగో విడత వారాహి యాత్రను పవన్ కళ్యాణ్ అవనిగడ్డ నుంచి ప్రారంభించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. ఒకటి రెండు రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలవుతారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత కదనరంగంలోకి దిగనున్నారు. లోకేష్ కూడా తన యువ గళం యాత్రను కొనసాగించనున్నారు. దీనితో మా పార్టీ పని కథ కంచికి.. నేను తప్ప మా వాళ్లంతా ఇంటికేనని రఘురామకృష్ణం రాజు అన్నారు. వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకులు చేసే పనికిమాలిన పనులను చంద్రబాబు నాయుడు అడ్డుకునే ప్రయత్నాన్ని చేసి ఉండకపోతే, ఆయనపై స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ లో స్కామ్ అంటూ అక్రమ కేసు నమోదు చేసి ఉండేవారు కాదు. ఆ పార్టీ వాళ్లు దొంగ ఓట్లను నమోదు చేస్తుండగా, ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. నేను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశాను. క్షేత్రస్థాయిలో ప్రతిపక్ష నాయకులు ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. మచిలీపట్నంలో దొంగ ఓట్ల నమోదును స్థానికులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. విశాఖపట్నంలో దొంగ ఓట్ల నమోదు ప్రక్రియను రామకృష్ణ బాబు, విష్ణుకుమార్ రాజులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రకాశం జిల్లాలో 20 మంది వ్యక్తులు సుమారు 70 నుంచి 80 మంది ఓట్లను తొలగించాలని ఫామ్ 7 దాఖలు చేశారు. వారు తమ ఫోన్ నెంబర్లని ఇచ్చుకోవడాన్ని ఏలూరు సాంబశివరావు గుర్తించారు. ఏడు మందిపై కంటే ఎక్కువగా ఫామ్ 7 దాఖలు చేయడానికి వీలులేదని నిబంధనలు చెబుతున్నాయి. అయినా అడ్డగోలుగా ఫామ్ 7 దాఖలు చేసి ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సభ ఉందంటే ఆరోజు వెయ్యి మంది ఓట్లను తొలగించే విధంగా ఎత్తుగడలు వేస్తున్నారు. జేబుదొంగల్లా వైఎస్‌ఆర్‌ పార్టీ ఎమ్మెల్యేలు తయారయ్యారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు అప్రమత్తంగా ఉండాలి. నిజమైన ఓట్లు అలాగే ఉంటే వైఎస్‌ఆర్‌ పార్టీ నెగ్గే అవకాశం లేదు. ఎలాగైనా దొంగ ఓట్లతో నెగ్గాలని వైఎస్‌ఆర్‌ పార్టీ నాయకులు ప్లాన్ చేస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

Also Read: నారా లోకేష్ అరెస్టు అయితే.. జరిగేది ఇదే!

జగన్‌మోహన్ రెడ్డి తోక పేరు కలిగిన సనామదీయుల మద్యం తాగి ఎంతోమంది మృతి

జగన్‌మోహన్ రెడ్డి తోక పేరు కలిగిన సనామదీయులు ఉత్పత్తి చేస్తున్న మద్యాన్నిసేవించి ఎంతోమంది మృత్యువాత పడ్డారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇదే విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా ఫిర్యాదు చేశారన్నారు. గతంలో నేను కేంద్ర మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశాను. కిడ్నీ ఇతర అవయవ రోగాలతో ఎంతోమంది ఆసుపత్రుల పాలవుతున్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి అనుయాయులు తయారు చేస్తున్న మద్యం తాగడం వల్ల అవయవాలు చెడిపోయి మద్యపాన ప్రియులు మృత్యువాత పడుతున్నారు. మంచినీళ్లకు, మురికి నీళ్లకు ఎంత తేడానో.. గతంలోని మద్యానికి, ప్రస్తుత మద్యానికి అంత తేడా ఉందన్నారు. మద్యంతో మృత్యువాత పడిన వారు ఎవరూ లేరని సంబంధిత శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకురాగా.. 200 నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో ఎక్విప్మెంప్‌మెంటే కళ్ళకు కనిపించడం లేదనే వారికి వేలాది చావులు కనిపిస్తాయా అంటూ ఎదురు ప్రశ్నించారు. మా వాడి దెబ్బకు, మంత్రులంతా తింగరి వాళ్ళలా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఇదే మద్యాన్ని ల్యాబ్‌లో పరీక్షలు చేయించి, ఆ నివేదికను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

చంద్రబాబు నిరసన దీక్షకు సంఘీభావం తెలుపుతున్న కోట్లాదిమంది ప్రజలు

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒకరోజు నిరసన నిరాహార దీక్షకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించి సంఘీభావాన్ని తెలియజేయాలని రఘురామకృష్ణం రాజు ప్రజలను కోరారు. గాంధీ జయంతి సందర్భంగా తన అక్రమ అరెస్టును నిరసిస్తూ తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక రోజు నిరసన నిరాహార దీక్ష చేపట్టగా, మద్దతుగా రాజమండ్రిలో ఉన్న ఆయన సతీమణి నారా భువనేశ్వరితో పాటు వేలాది మంది మహిళలు నిరసన దీక్షలో పాల్గొన్నారు. కోట్లాదిమంది ప్రజలు ఇళ్లలోనే చంద్రబాబు నాయుడు నిరసన నిరాహార దీక్షకు మద్దతుగా ఆహారాన్ని భుజించడం మానివేశారు. ఈ విషయాన్ని స్వయంగా వారే తెలియజేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. పార్టీలకతీతంగా ప్రజాస్వామ్య వాదులందరూ చంద్రబాబు నాయుడు చేపడుతున్న నిరసన దీక్షకు మద్దతును తెలియజేసినట్లు తెలిపారు.

చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేయాలని నిర్ణయించింది మా పార్టీ కాదని, ఈ దుష్ట పాలకులని అన్నారు. ఈ దుష్ట పాలకుల ధమన నీతికి వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న నిరసన దీక్షలో నేను కూడా పాల్గొంటున్నానని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. ప్రజల నుంచి ఉవ్వెత్తున వెల్లువవుతున్న ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వ పాలకులు గ్రహిస్తే మంచిది. లేకపోతే రానున్న ఎన్నికల్లో మెజార్జీ స్థానాలు కూడా దక్కవు. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ, మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న 60 మందిపై సౌండ్ చేశారన్న కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారట. కరోనా సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు ప్రజలంతా ప్లేట్ పై గరిటతో వాయిస్తూ శబ్దం చేశారు. మరి అప్పుడు కేసులు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోడీ అంటే భయం… ప్రతిపక్ష పార్టీలు అంటే అంత చులకన అని ఆయన నిలదీశారు.

Also Read: ‘వాలంటీర్లే వేస్ట్ అనుకుంటే.. వారికింకా ట్రైనింగా?’