అమరావతి, అక్టోబర్ 4: చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest) నేపథ్యంలో ఏపీలోని అధికార ప్రతిపక్ష పార్టీల దూకుడు జోరందుకుంది. తనను టార్గెట్ చేస్తూ టీడీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ (TDP Leader Bandaru Satyanarayana) చేసిన వ్యాఖ్యలపై రోజా స్పందించారు. నీగత జీవితం ఇదీ అంటూ బండారు సత్యనారాయణ మంత్రి రోజాను (Minister Roja) వ్యక్తిగతంగా కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు (Viral Comments) చేయడం తీవ్ర దుమారం లేపింది. కేవలం 3 నెలల వ్యవధిలో చంద్రబాబును పంపిన అదే రాజమండ్రి జైలుకు నిన్నుకూడా పంపుతానంటూ హెచ్చరికలు జారీ చేశారు. రోజా నటించిన బ్లూ ఫిల్మ్ (Blue Films) వీడియోలు తన వద్ద ఉన్నాయని, దగ్గరే ఉండి ప్రోత్సహిస్తున్నారంటూ సీఎం జగన్‌ను కూడా విమర్శించారు. అయితే రోజా మాత్రం ఎక్కడా తగ్గకుండా ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులను మంత్రి రోజా ఏకిపారేశారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులపై ‘మీరా నన్ను విమర్శించేది’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో మంత్రి రోజా మంగళవారం (అక్టోబర్ 3) భావోద్వేగ ట్వీట్ చేశారు.
Also Read: AP Elections 2024: ‘సీటు జారి గల్లంతైందే..’ వైసీపీలో ఎమ్మెల్యే సీట్ల కేటాయింపుపై మల్లగుల్లాలు!
‘పురుషాధిక్య ప్రపంచంలో ఓ మహిళగా నాకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకోవడం కష్టమని 40 ఏళ్ల క్రితం చెప్పాను. మహిళలను అణచివేయాలనుకునే స్త్రీ ద్వేషులకు వ్యతిరేకంగా నేను అవిశ్రాంతంగా పోరాడాను. రెండు సార్లు ఎన్నికల్లో పట్టుదలతో పనిచేసి ఎమ్మెల్యేగా గెలిచాను. వైఎస్ జగన్ మహిళా అనుకూల విధానాలకు కృతజ్ఞతలు. ప్రస్తుతం ఏపీ మంత్రిని అయ్యాను. మహిళలు ఎంత అభివృద్ధి సాధించినా, ఎంత ఎదిగినా బండారుసత్యనారాయణ వంటి కొంతమంది సంకుచిత మనస్తత్వం కలిగిన పురుషుల ఆలోచన ధోరణి మాత్రం మారడం లేదు. నాపై నీచమైన, నిరాధారమైన ఆరోపణలు చేశారు. నా క్యారెక్టర్‌ను ప్రశ్నించారు. మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసే వ్యక్తులకు మద్దతు ఇస్తారా అని నేను అన్ని జాతీయ మీడియ ప్రతినిధులను ప్రశ్నిస్తున్నాను. పబ్లిక్ లైఫ్‌లో లేదా పనిచేసే చోట మహిళలు ప్రశ్నార్ధకమైన క్యారెక్టర్ కలిగి ఉంటారని నమ్ముతున్నారా? మీరెందుకు మౌనంగా ఉంటారు. ప్రశ్నించండి.. బండారు సత్యనారయణ వంటి మతోన్మాద వ్యక్తులు ఆడవారి కలలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలంటే టీడీపీకి ఇంత చిన్నచూపా అని మహిళాలోకం ప్రశ్నిస్తోంది. ఇలాంటి వారిని కట్టడి చేయకుండా ప్రోత్సహించేలా వ్యవహరించడం ఏంటని’ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం మంత్రి రోజా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజెన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. రోజాను ఉద్దేశిస్తూ నీచాతి నీచంగా టీడీపీ నేత విమర్శించడంపై పలువురు ప్రముఖులు విమర్శలు చేస్తున్నారు.
Forty years ago, I was told that I was working in a cutthroat, male-dominated world and that it would be difficult to make a mark as a woman. I worked tirelessly against entrenched misogynists. Though I faced defeat in two election, I persevered and won as an MLA for two… pic.twitter.com/qLkDFpkiPV
— Roja Selvamani (@RojaSelvamaniRK) October 3, 2023
రాజకీయంగా ఎదుర్కోలేక తనపై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని, మహిళా లోకాన్ని అవమానించేలా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మంత్రి రోజా మండిపడ్డారు. టీడీపీ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి తనను వేధిస్తున్నారంటూ ఆమె మంగళవారం మీడియా సమావేశంలో కన్నీటిపర్యాంతమయ్యారు. బ్లూ ఫిలిమ్స్‌లో నటించానని అంటూ తనను టార్చర్ చేస్తున్నారని, అసెంబ్లీలో సీడీలను కూడా చూపించారు కానీ, ఎప్పుడూ నిరూపించలేదన్నారు. మహిళలు నచ్చినట్లు బతకమని సుప్రీంకోర్టే చెప్పిందని, నా క్యారెక్టర్‌ను జడ్జ్ చేయడానికి మీరెవరంటూ ప్రశ్నించారు. మహిళల్ని టీడీపీ ఆట వస్తువుల్లా చూస్తోందని, దమ్ముంటే సీడీలను ప్రజల్లోకి విడుదల చేయాలని సవాల్ విసిరారు. తనపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు సమర్థించడం సరికాదని మంత్రి రోజా మండిపడ్డారు.
Also Read: ‘లోకేష్‌పై పెట్టిన కేసుల్లో పసలేదు.. సుప్రీంలో బాబుకు విజయం ఖాయం’
అనంతరం దీనిపై లోకేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, నందమూరి కుంటుంబాన్ని కూడా ప్రశ్నించారు. వారి తల్లులు, భార్యలు, కూతుళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైతే ఇలాగే చేస్తారా? మహిళపై అభ్యంతరకర ఆరోపణలు చేస్తే టీడీపీ ఖండించకుండా ఆయనకు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. ఎన్టీయార్‌కు అన్నం కూడా పెట్టని వాళ్లు ఈరోజు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక మంత్రిరోజాపై చేసిన వ్యాఖ్యలకు గానూ బండారు సత్యనారాయణపై గుంటూరు జిల్లా నగర పాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు సోమవారం (అక్టోబర్ 2) ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇంత చేసీ టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన ఆరోపణలు రోజా ఖండించకపోవడం కొసమెరుపు. అసలు ఆ వీడియోల్లో ఉన్నది నేనుకాదు అని కూడా కనీసం చెప్పలేదు. ఇక మిగతా వైపీసీ నేతలు సైతం మద్ధతుగా గళం విప్పకపోవడం గమనార్హం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

2 Comments
Comments are closed.