చిత్తూరు, అక్టోబర్ 5: చిత్తూరు జిల్లాలో ఇద్దరు కోవర్టుల (coverts) వల్ల టీడీపీ (TDP) ప్రతిష్ట దిగజారి పోతోందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గుర్తించారు. తన స్వంత జిల్లాలో పార్టీ చతికిల పడటానికి గల కారణాలను ఆయన గుర్తించారు. ముఖ్యమైన పార్టీ నేతలు, రాబిన్ శర్మ బృందం నివేదికలు ఆయన తెప్పించారు. తాను నమ్మిన కొందరు పార్టీకి తీరని ద్రోహం చేశారని తెలుసుకున్నారు. టీడీపీ ప్రారంభించిన తరువాత 1983లో జరిగిన ఎన్నికల్లో జిల్లా (Chittoor)లో ఉన్న 15 స్థానాల్లో టీడీపీకి 14 స్థానాలు వచ్చాయి. అలాగే 1994లో కూడా పార్టీ 14 చోట్ల విజయం నమోదు చేసుకుంది. అయితే తరువాత రాను రాను ఐదారు స్థానాలకు పరిమితం అయ్యింది. 2014 ఎన్నికల్లో మొత్తం 14 స్థానాల్లో టీడీపీకి ఆరు స్థానాలు వచ్చాయి. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ స్వంత జిల్లాలో సీట్లు తగ్గాయి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తరువాత జిల్లాలో చంద్రబాబు ఒక్కరే గెలిచారు. మిగిలిన 13 చోట్ల వైసీపీ అభ్యర్ధులు గెలవడం గమనార్హం. దీనిని ఆసరాగా తీసుకుని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చంద్రబాబును చులకన చేసి మాట్లాడుతున్నారు. స్వంత జిల్లాలో చంద్రబాబు నాయకత్వంలో ఒక సారి కూడా మెజారిటీ సీట్లు (majority seats) రాలేదని ఎద్దేవా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కూడా కుప్పంలో ఓడిస్తామని సవాలు విసురుతున్నారు.
Also Read: Tollywood Actress: కొడుకుతో ఉన్న ఈ తెలుగు హీరోయిన్‌ని గుర్తుపట్టారా? ఇలా మారిపోయిందేంటి..
ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీ దిగజారడం కారణాలను బాబు విశ్లేషించారు. సీనియర్ నాయకుడు ఒకరు శకుని పాత్ర పోషిస్తున్నారని పసిగట్టారు. టీడీపీ జిల్లా కేంద్రంలో ఉన్న ఆయన, మిగిలిన నాయకులను అణచివేసి పార్టీకి దూరం చేస్తున్నారని తెలుసుకున్నారు. ఆయన నిర్వాకం వల్లనే మాజీ రాజ్యసభ సభ్యురాలు ఎన్‌పి దుర్గ, మాజీ లోక్ సభ సభ్యుడు ఎన్‌పీ చెంగల్రాయ నాయుడు కుటుంబాలు పార్టీకి దూరం అయ్యాయి. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పార్టీకి దగ్గర కాలేక పోతున్నారు. జిల్లా పరిషత్ మాజీ ఛైర్‌పర్సన్ గీర్వాణి, ఆమె భర్త చంద్రప్రకాష్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇంకా పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పార్టీకి దూర దూరంగా ఉంటున్నారు.
అలాగే చిత్తూరుకు ‘దొర’లాంటి ఆయనకు తోడు నేనున్నా ‘నానీ’లు సొంత ఇంటికే కన్నం వేస్తున్నట్లు చంద్రబాబు గుర్తించారు. ఈ కీలక నేత శల్య సారధ్యం వల్లనే పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు దెబ్బ తిన్నాయని తెలుసుకున్నారు. ఆయన వల్ల మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి పార్టీ క్రియాశీల కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. జీడీ నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజక వర్గాల్లో వర్గపోరు మొదలయ్యింది. ఆయనతో పొసగక పోవడం వల్ల రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్‌బీ సుధాకర్ రెడ్డి అస్త్ర సన్యాసం చేశారు. టీవీ డిబేట్లలో కూడా పాల్గొనడం లేదు. అలాగే రాష్ట్ర కార్యదర్శి సందీప్ చౌదరి కూడా పార్టీకి దూరం అయ్యారు.
Also Read: ‘లోకేష్‌పై పెట్టిన కేసుల్లో పసలేదు.. సుప్రీంలో బాబుకు విజయం ఖాయం’
లోకేష్ పాదయాత్ర సందర్భంలో కూడా జన సేకరణ పేలవంగా జరిగింది. అప్పుడే లోకేష్ సమావేశం ఏర్పాటు చేసి ఈ నాయకులను మందలించినట్లు సమాచారం. ఈ ఇద్దరు నేతలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డితో లావాదేవీలు ఉన్నాయన్న విషయం కూడా చంద్రబాబు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్టు తెలిసింది.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తాకథనాల కోసం క్లిక్ చేయండి.
