ఆంధ్రప్రదేశ్ లో గత నెల రోజుల నుంచి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్న విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత సీఎం జగన్ పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు సొంత పార్టీ పై, సీఎం జగన్ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. నేడు ఢిల్లీలో మీడియా వేధికగా ఆయన మాట్లాడుతూ.. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం ఇచ్చిన 161 స్టేట్మెంట్ రద్దు చేయాలని వేసిన పిటీషన్ హైకోర్టు కొట్టి వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నారు.
పిటిషన్ దాఖలు చేసిన వారు, రెండు వారాలు వాయిదా కోరడం విడ్డూరం. అజయ్ కల్లం 161 స్టేట్మెంట్ ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నట్లు సిబిఐ పేర్కొనడంతో పిటిషన్ రద్దు చేసే అవకాశాలే అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. హైకోర్టు పిటిషన్ రద్దు చేస్తే దాని ప్రభావం సుప్రీంకోర్టులో తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ కేసులో ఇంకెవరెవరు ఉన్నారన్నది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఇంకా ఉన్నవారు ఒంటరిగానా?, జంటగానా అన్నది చూడాలని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఏసీబీ కోర్టులో A9 గా ఉన్న వైయస్ భాస్కర్ రెడ్డి బెయిలు పొడిగింపు పిటిషన్ విచారణకు రానుంది. రెండు వారాల ఎస్కార్ట్ బెయిల్ ఇచ్చిన ఏసీబీ కో ర్టు, రెండు నెలల పొడిగింపు కోరుతూ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై రెండు నెలలు కాకపోతే మూడు నెలలు తీసుకోమంటుందా?, బయటకు పొమ్మని కొట్టి వేస్తుందా? చూడాలని రఘురామకృష్ణం రాజు అన్నారు.
ఇక ఏపీలో 50 శాతం ఉద్యోగులకు ఇంకా జీతాలే ఇవ్వలేదని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 71 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినప్పటికీ, ఇంకా 50 శాతం మంది ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలే ఇవ్వలేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఆర్బిఐ నుంచి 44 వేల కోట్ల రూపాయలు, ఇతర చిల్లర అప్పులు, కార్పొరేషన్ పేరిట చేసిన అప్పులతో మొదలుకొని 71 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఇన్ని అప్పులు చేసి కూడా మళ్లీ ఢిల్లీ వీధుల్లో ఇంకా సీఎం జగన్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు అప్పుల కోసం తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఐఏఎస్ ల కోసం జీతాలు ఇవ్వడానికి ఏర్పాటుచేసిన కనసా లిటెడ్ పండ్ కూడా ఈ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఐఏఎస్ ల కూడా జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు.
