ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గత నెలలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై దేశమంతా ధర్నాలు, దీక్షలు ఇంకా జరుగుతూనే వున్నాయి. దేశ ప్రధాని మోదీ ఇటీవల తెలంగాణలో పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా చంద్రబాబు అరెస్ట్ అంశంపై ఎలాంటి స్పందన లేదు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయన చలన చిత్ర రంగంతో గొప్ప అనుబంధం ఉండేది.
ఆయన అరెస్ట్ పై కొద్దిరోజుల క్రితం నిర్మాతలు అశ్వనీదత్,కె.ఎస్.రామారావు, రవిబాబు, నట్టికుమార్ వంటి కొద్ది మంది మినహా మిగిలిన వారు పెద్దగా స్పందించలేదు.కాకపోతే ఏదైనా సినిమా ఫంక్షన్‌కు జరిగితే మాత్రం అక్కడ హీరోలకు, ప్రముఖ దర్శకులకు, నిర్మాతలకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కరెక్టా కాదా? అనే ప్రశ్నలు విలేకరులనుంచి వస్తూనే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి పవిత్ర లోకేష్ భర్త అయిన సీనియర్ నటుడు నరేష్‌కు కూడా ఎదురైంది. అయితే తాజాగా ఆయన ఆహా! అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఓ వెబ్ సిరీస్ చేశాడు. దానిపేరు ది గ్రేట్ ఇండియన్ సుసైడ్. అయితే ఈ వెబ్ సిరీస్ లో పవిత్ర లోకేష్, హెబ్బాపటేల్ నటించారు.
ఈనెల 6న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రమోషన్‌లో భాగంగా నరేష్‌కు చంద్రబాబునాయుడు అరెస్ట్ గురించి స్పందించమని అడిగితే, వెంటనే ఆయన తన టైటిల్ వున్న పోస్టర్‌ను చూపించి ది గ్రేట్ ఇండియన్ సుసైడ్ అని చెప్పకనే సమాధానం చెప్పారు. అంటే దానర్ధం చంద్రబాబు గారి అరెస్ట్ అనేది సుసైడ్‌తో సమానం అన్నారు.అయితే విలేఖరులు మరో ప్రశ్న వేస్తే నేను చెప్పింది నా వెబ్‌సీరిస్ అంటూ ఆయన తెలివిగా మాట మార్చారు.

Comments are closed.