Film Actor Dream: ‘కన్నా.. ఎంతపని చేశావురా..?’ సినిమాలపై మోజుతో నిండు జీవితాన్ని పణంగా పెట్టిన యువకుడు..

ఇక ఎప్పటికీ నటుడిగా తెరపై మెరవలేనేమోననే నిరాశ..

Youth Died by Suicide Youth Died by Suicide
Share this :

పార్వతీపురం మన్యం, నవంబర్‌ 4: ఏదో ఒక రోజు మంచి సినిమా (Cinema) తీయాలి.. మంచి హీరో (Film hero)ని కావాలి.. అది ఆ యువకుడి కల (Film Actor Dream).. అందుకోసం నిరంతరం ఆలోచించేవాడు. గ్లామర్ పెంచుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు. సినిమాల్లోకి వెళ్లాలంటే ఏం చేయాలి? ఎలా చేస్తే సినిమాల్లో రాణించగలం? అని నిత్యం స్నేహితులతో చర్చిస్తుండేవాడు. అంతే కాదు గూగుల్ (Google), యూట్యూబ్‌ (You Tube)లో సెర్చ్ చేసి మరీ చూసేవాడు. ఈ క్రమంలోనే తమ స్నేహితులు ఇచ్చిన సలహా మేరకు ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. సినిమాలో రాణించాలంటే సినిమా తీయాలి? సినిమా తీయాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి? కోట్లు ఖర్చుపెట్టే స్తోమత లేదు కాబట్టి, తన టాలెంట్‌ని అయినా ప్రపంచానికి తెలియజేయాలి. అందుకు ఒకే ఒక్క మార్గం అని ఏపీ (Andhra Pradesh)కి చెందిన ఈ కుర్రాడు క్షణికావేశంలో ఘోర నిర్ణయం (Andhra Pradesh Crime) తీసుకున్నాడు..

Also Read: TDP Bathyala Changalrayudu: వైసీపీ గూటికి బత్యాల..! బెర్త్ ఖాయమేనా? ఆసక్తిగా రాజంపేట రాజకీయాలు

తనకున్న ట్యాలెంట్‌తో, కొద్దిపాటి డబ్బు పెట్టుబడిగా పెట్టి షార్ట్ ఫిలిమ్స్ (Short Films) తీసి అందులో రాణించాలనుకున్నాడు. తన ట్యాలెంట్‌ను ఫైనాన్షియర్స్‌కి చూపించి సినీ రంగ ప్రవేశం చేద్దామని కలలుకన్నాడు. అందుకోసం తెలిసిన వాళ్ల వద్ద అప్పులు కూడా చేశాడు. అలా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశాడు. అయితే అతను తీసిన షార్ట్ ఫిలిమ్స్ అంతగా రాణించలేదు. అలా తలకు మించిన భారంతో అప్పులు (Debts) కొండల్లా పెరిగాయి.

Suicide
Suicide

మరోవైపు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి కూడా ఎక్కువైంది. అయినా తీరు మార్చుకోలేదు. ఎలాగైనా మరిన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసి అందులో రాణించి సినీరంగ ప్రవేశం చేయాలని తపన పడ్డాడు. ఈ క్రమంలోనే మరొక షార్ట్ ఫిలిం తీసేందుకు సిద్ధమయ్యాడు. అందుకోసం తన తల్లిని రూ.50 వేలు అడిగాడు. అయితే తల్లికి అంత ఆర్థిక స్తోమత లేదు. ఆమె ప్రభుత్వం అధీనంలో నడుస్తున్న మెప్మాలో రీసోర్స్ పర్సన్‌గా చిన్న ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోన్న చిన్న ఉద్యోగి. ఆర్థికంగా తన పరిస్థితి సరిగా లేకపోవడంతో కొడుకు అడిగిన యాబై వేలు ఇవ్వలేక పోయింది.

Also Read: TDP Nilayapalem Vijay Kumar Flagged on CM Jagan: ‘కృష్ణా జలాల పంపిణీలో ఏపీకి అన్యాయం జరుగుతున్నా సీఎం జగన్‌ ఎందుకు నోరెత్తడం లేదు?’

తలకు మించి అప్పులు చేసినా.. తీరని కోరిక..

దీంతో తీవ్ర మనస్థాపం చెందిన యువకుడు తన కోరిక తీరట్లేదని మదనపడ్డాడు. కోరిక తీరాలంటే కావలసిన డబ్బు కావాలి, అది తన దగ్గర లేదు.. ఇక తన కోరిక తీరే పరిస్థితి లేదని నిర్ణయించుకొని చావే శరణ్యం అనుకున్నాడు. దీంతో ఇంట్లో తాన బెడ్‌ రూంలోనే ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య (Suicide)కు పాల్పడ్డాడు. గదిలోకి వెళ్ళిన కొడుకు ఎంతకీ తలుపు తీయకపోవడంతో స్థానికులు సహాయంతో తలుపులు తెరిపించింది ఆ తల్లి. తలుపులు పగలగొట్టగా ఫ్యాన్‌కు కొడుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. చేతికి అందొచ్చిన కొడుకు కళ్లముండే మృతి చెందటం చూసి తల్లి గుండె బద్ధలయ్యింది. కొడుకు మృతదేహం పట్టుకుని రోధించిన తీరు స్థానికులను కలచివేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని పార్వతీపురం మన్యం జిల్లా (Parvathipuram Manyam district) కేంద్రం మణికంఠ కాలనీకి చెందిన దుప్పలపూడి సునీల్ (21) అనే యువకుడి విషాదాంత కథనం స్థానకంగా సంచలనంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.