Venomous Snake at Vizag: జాలర్ల వలకు చిక్కిన సాగర సర్పం.. కాటేస్తే యమ డేంజర్‌

తిరిగి సముద్రంలో వదిలేసిన మత్స్యకారులు

Share this :

Venomous Snake at Vizag విశాఖపట్నం, నవంబర్‌ 2023: అరుదైన విషసర్పం (venomous snake) అది. చేపల వేటకు వెళ్ళి వచ్చి మంచి చేపలు పడి ఉంటాయన్న ఆశతో వల విప్పిన మత్స్యకారులకు (fishermen) వళ్ళు గగుర్పాటుకు గురి చేసే విధంగా కనిపించింది. దేనికీ పెద్దగా భయపడేతత్వం లేని మత్స్యకారులకు సైతం దాన్ని చూడగానే మస్తిష్కంలో వణుకు పుట్టింది. సాధారణంగా సముద్రంలో విష సర్పాలు (poisonous snakes) ఉండవు. నీటిలో అవి మనుగడ సాగించలేవు.

కానీ ఇది అరుదైన విష సర్పం. విశాఖ (Visakhapatnam) నగర పరిధిలోని సాగర్ నగర్ వద్ద ఈ ఘటన జరిగింది. నిరంతరం పర్యాటకుల సందడితో ఉండే ప్రాంతం అది. స్థానిక మత్స్య కారులు (fishermen) కూడా సముద్రంలో ఎక్కువ దూరం కూడా వేటకు వెళ్ళలేదు. తీరానికి 500 మీటర్లలోపే చేసిన వేటలో చేపల (Fish)తో పాటు ఈ సర్పం కూడా బయటకు వచ్చింది. ఇలా వలలో పాములు చిక్కడం సహజమైన విషయమే కానీ అవి విష సర్పాలు కావు, నీటి సర్పాలు అయి ఉంటాయి. అయితే అవి ప్రమాద రహితం.

చదవండి: MP Raghu Rama Krishna Raju: ‘నారా లోకేష్ యువగళం చేసే శబ్దానికి ఈ ప్రభుత్వం పునాదులు కదలడం ఖాయం’.. ఎంపీ రఘురామ

సముద్ర జలాల్లో సుదూరంగా సంచరించే ఈ జీవి టెక్నికల్ నేమ్ హైడ్రోఫిస్ సీ స్నేక్. ఈ పాము అత్యంత విష పూరితమని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి. శ్రీనివాసరావు వివరించారు. ఇది కరిస్తే బతకడం అసాధ్యమట. కరిసినప్పుడు నిమిషాల్లో మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాణాలే పోతాయి. సముద్రం అడుగు భాగంలో చిన్న చిన్న చేపలు, రాళ్లలోని నాచు తింటూ ఇవి మనుగడ సాగిస్తుంటాయి. ఫుడ్ కోసం వెతుకులాటలో ఒక్కోసారి చేపలలో కలిసి వలల్లో చిక్కుకుంటాయని మత్స్యకారులు తెలిపారు. ఈ పామును కట్ల పాము అని కూడా పిలుస్తుంటామనీ మత్స్యకారులు పేర్కొన్నారు. విష సర్పం అయినా సుమారు ఏడడుగులున్న ఈ పామును చంపకుండా మళ్లీ తిరిగి సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెట్టీ మత్స్యకారులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.