DGP Anjani Kumar: డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు.. పోలీసులకు డీజీపీ అంజనీ కుమార్ కీలక ఆదేశాలు జారీ

ఎవరు గెలిచినా ఆ విషయంలో అప్రమత్తంగా ఉండండి..

Share this :

DGP Anjani Kumar Instructions to Police హైదరాబాద్‌, డిసెంబర్‌ 2: రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (TS Assembly Election Results 2023) సంబంధించి ఓట్ల లెక్కింపు సందర్భంగా సీపీలు (CPs), ఎస్పీ (SPs)లతో డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) ఈ రోజు (శనివారం) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, లెక్కింపు కేంద్రాల బయట పటిష్ఠ నిఘా (Police Security) పెట్టాలని సూచించారు.

అలాగే లెక్కింపు కేంద్రాల లోపల సైతం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చివరి రౌండ్ల లెక్కింపు మరింత ఉత్కంఠగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. ఆ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఎవరినీ గుమిగూడనివ్వొద్దని, పికెటింగ్ చేయడంతో పాటు అదనపు బలగాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఈ మేరకు లెక్కింపు కేంద్రాల వద్ద బందోబస్తుపై సమీక్ష నిర్వహించారు.

చదవండి: TS Assembly Election Results 2023: మరికొన్ని గంటల్లో కౌంగింగ్‌ ప్రారంభం.. నేతల గుండెల్లో గుబులు..!

ఎవరు గెలుపొందినా.. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. ప్రతీకారదాడులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు ఎలాంటి విఘాతం లేకుండా ఎన్నికల బందోబస్తు నిర్వహించామని, ఈ రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీపీలు, ఎస్పీలను డీజీపీ అంజనీ కుమార్‌ ((DGP Anjani Kumar)) ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.