Hyderabad: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ ఏరియాల్లో 2 రోజులు వాటర్ కట్!

కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్‌ ఫేజు - 3లో మరమ్మతు పనులు

Share this :

హైదరాబాద్, డిసెంబర్ 12: హైదరాబాద్‌ (Hyderabad)లో కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగు నీటి (Drinking water) సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్‌ (Krishna Water Supply Project) ఫేజు – 3లో కోదండాపూర్ పంపింగ్ స్టేషన్ వద్దనున్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ హెడర్‌పైపు లైనుకు భారీ లీకేజీ (water leakage) ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టడానికి మరమ్మతు పనులు చేపడుతున్నారు. దీందో డిసెంబర్‌ 13 (బుధవారం) ఉదయం 5 గంటల నుంచి ఆ మరుసటి రోజు అంటే డిసెంబర్‌ 14 (గురువారం)వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఈ మరమ్మతు పనులు జరుగుతాయి. 24 గంటల పాటు రిజర్వాయర్ల పరిధిలోని ఈ కింది ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు ఇవే..

  • ఓ అండ్ ఎం డివిజన్ – 1 : శాస్త్రిపురం
  • ఓ అండ్ ఎం డివిజన్ – 2 : బండ్లగూడ
  • ఓ అండ్ ఎం డివిజన్ – 3 : భోజగుట్ట, షేక్ పేట్
  • ఓ అండ్ ఎం డివిజన్ – 4 : ఆళ్లబండ
  • ఓ అండ్ ఎం డివిజన్ – 6 : జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, ప్రశాసన్ నగర్, తట్టిఖానా
  • ఓ అండ్ ఎం డివిజన్ – 7 : లాలాపేట్ పాక్షిక ప్రాంతాలు
  • ఓ అండ్ ఎం డివిజన్ – 10 : సాహేబ్ నగర్, ఆటోనగర్, సరూర్ నగర్, వాసవి రిజర్వాయర్
  • ఓ అండ్ ఎం డివిజన్ – 13 : సైనిక్ పురి, మౌలాలి
  • ఓ అండ్ ఎం డివిజన్ – 14 : స్నేహపురి, కైలాసగిరి, దేవేంద్ర నగర్
  • ఓ అండ్ ఎం డివిజన్ – 15 : గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావురి హిల్స్
  • ఓ అండ్ ఎం డివిజన్ – 16 : మధుబన్, దుర్గానగర్, బుద్వేల్, సులేమా నగర్, గోల్డెన్ హైట్స్, 9 నంబర్12.
  • ఓ అండ్ ఎం డివిజన్ – 18 : కిస్మత్ పూర్, గంధం గూడ
  • ఓ అండ్ ఎం డివిజన్ – 19 : బోడుప్పల్, మల్లికార్జున నగర్, మానిక్ చంద్, చెంగిచెర్ల, భరత్ నగర్, పీర్జాదీగూడ14.
  • ఓ అండ్ ఎం డివిజన్ – 20 : ధర్మసాయి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.